Telangana Narcotics Police: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ డ్రగ్స్, మద్యం తాగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన సంగతి తెలిసిందే. సీఎం రేవంత్ ఆదేశాల మేరకు హైదరాబాద్ పోలీసులు కూడా డ్రగ్స్‌పై చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఈనేపథ్యంలో.. తెలంగాణ నార్కోటిక్స్ పోలీసులు తాజాగా సామాన్యులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. గంజాయిపై సమాచారం ఇచ్చిన వారికి భారీ రివార్డు ప్రకటించారు. ఏకంగా 2 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. అయితే, 100 కిలోల కంటే ఎక్కువ గంజాయి స్మగ్లింగ్ గురించి సమాచారం ఇస్తే మాత్రమే ఈ మొత్తాన్ని బహుమతిగా గెలుచుకునే అవకాశం ఉంది. డ్రగ్స్, గంజాయిపై ఫిర్యాదు చేసేందుకు 8712671111కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు.
Read also: CM Stalin: కచ్చతీవును ఇంకెప్పుడు స్వాధీనం చేసుకుంటారు.. ప్రధానిపై స్టాలిన్ ఫైర్..!
రాష్ట్రంలో ఈ ఏడాది ఇప్పటి వరకు 1,892 డ్రగ్స్ కేసులు నమోదైనట్లు నార్కోటిక్ పోలీసులు తెలిపారు. జనవరి నుంచి ఇప్పటి వరకు రూ.179.3 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు నార్కోటిక్స్ పోలీసులు తెలిపారు. జనవరి నుంచి జూన్ నెలాఖరు వరకు రాష్ట్రవ్యాప్తంగా 679 గంజాయి కేసులు నమోదు కాగా, 120.41 కోట్ల రూపాయల విలువైన 42,000 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నగరంలో డ్రగ్స్ కేసులతో పాటు సైబర్ క్రైమ్ కేసులు కూడా భారీగా పెరిగాయని.. అధికారులు తెలిపారు. ఈ ఏడాది గడిచిన 6 నెలల్లో దాదాపు 2.52 లక్షల సైబర్ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఆరు నెలల్లో మోసగాళ్ల నుంచి దాదాపు 262 కోట్ల రూపాయల నగదు బయటపడిందని, 5,191 మంది బాధితులకు తిరిగి చెల్లించామని ఆయన చెప్పారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
CM Revanth Reddy: నేడు మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్.. మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఎవరికి?