Fire Accident: హైదరాబాద్ మహా నగరంలోని నాంపల్లిలో గల ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో ఈరోజు (డిసెంబర్ 7న) ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ల్యాబ్ బిల్డింగ్ మొదటి అంతస్తులో మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల ప్రాంతంలో తీవ్ర కలకలం చోటు చేసుకుంది. మంటల ఒక్కసారిగా వ్యాపించడంతో భవనం మొత్తం దట్టమైన పొగలు అలుముకోవడంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం కలిగింది. విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెస్తుంది. పొగ కమ్మేయడంతో మంటలను అదుపులోకి తీసుకురావడానికి ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.
Read Also: Minister Ramprasad Reddy: క్వాంటమ్ వ్యాలీతో ఇకపై అమరావతి వేగంగా అభివృద్ధి..
అయితే, తెలంగాణ స్టేట్ ఫోరెన్సిక్ ల్యాబ్ కావడం వల్ల అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ల్యాబ్‌లో డీఎన్‌ఏ పరీక్షలు, ఫింగర్‌ప్రింట్ విశ్లేషణతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు కీలక కేసుల్లో ఆధారాల ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ లోనే ఉన్నాయి. ఎఫ్ఎస్ఎల్ కంటే కార్యాలయంలోనే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన ఆధారాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఫస్ట్ ఫ్లోర్ లో కంప్యూటర్ ల్యాబ్ తో పాటు కీలకమైన గదులు ఉండటంతో.. పలు కేసుల్లో సేకరించిన పేపర్ వర్క్ ఎవిడెన్స్ సైతం ఫస్ట్ ఫ్లోర్ లోనే ఉన్నట్లు తెలుస్తుంది. పొగలు పూర్తిగా అదుపులోకి వస్తేనే ఎంత వరకు నష్టం వాటిల్లిందో తెలిసే అవకాశం ఉంది.
