Loan Fraud: నకిలీ పత్రాలతో బ్యాంకు లోన్లు.. దంపతులకు ఏడేళ్ల జైలు శిక్ష..
- హైదరాబాద్ లో హౌసింగ్ లోన్ మోసం కేసు..
- దంపతులకు ఏడేళ్ల జైలు శిక్ష విధించిన నాంపల్లి కోర్టు..
- ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, కెనరా బ్యాంకులను మోసం చేసిన నిందితులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Loan Fraud: హౌసింగ్ లోన్ మోసం కేసులో ఓ దంపతులకు ఏడేళ్ల జైలు శిక్షను విధించింది నాంపల్లి కోర్టు. నకిలీ పత్రాలతో లోన్లు తీసుకుని బ్యాంకులను మోసం చేసిన దంపతులు దసరథ్ నేత, లక్ష్మీబాయిగా గుర్తించారు. అయితే, ఈ కేసును విచారించిన సీఐడీ అధికారులు ఛార్జ్ షీట్‌ను దాఖలు చేశారు. కాగా, ఈ కేసులో మొత్తం 17 మంది సాక్షులతో పాటు, నకిలీ సేల్ డీడ్ పత్రాలు, GPA పత్రాలు, తాకట్టు పత్రాలు, మోసపూరిత అమ్మకపు పత్రాలు, ఆస్తి రిజిస్ట్రేషన్ రికార్డులు వంటి 60 పత్రాలను సీఐడీ అధికారులు కోర్టుకు సమర్పించారు.
Read Also: Naari Naari Naduma Murari : పెద్ద సినిమాల నడుమ శర్వా సినిమా.. అయ్యే పనేనా?
Also Read
ఇక, ఇరువురి తరపున వాదనలు పూర్తైన అనంతరం, నిందితులకు ఏడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.30 వేల జరిమానా విధిస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే, 2007లో SBH ఎయిర్ కార్గో బ్రాంచ్ నుంచి మోసపూరితంగా రూ.24 లక్షల హౌసింగ్ లోన్‌ను నిందితులు పొందారు. నకిలీ డాక్యుమెంట్లు, నకిలీ సంతకాలు, నకిలీ ‘సేల్ అగ్రిమెంట్’ పత్రాలు సమర్పించడం ద్వారా మోసానికి పాల్పడినట్లు గుర్తించారు. అలాగే, SBIతో పాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, కెనరా బ్యాంకులను కూడా ఈ దంపతులు మోసం చేసినట్లు విచారణలో తేలింది.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్‌లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!