MMTS: ఎంఎంటీఎస్ రైళ్లు ఉదయం నుంచి రాత్రి వరకు మాత్రమే తిరుగుతున్న సంగతి తెలిసిందే. కానీ, తాజాగా రాత్రి నుంచి తెల్లవారుజూము వరకు కూడా సర్వ్ చేసేందుకు సిద్ధమైంది. అయితే ఈ సేవలు రెండు రోజులకు మాత్రమే అందించనున్నారు. ఎందుకంటే.. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో గణేష్ ఉత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అలాగే ఓ వైపు నిమజ్జన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 17, 18 తేదీల్లో భారీగా నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. కాబట్టి ఆ రెండు రోజులు కూడా రాత్రి సర్వీసులు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ముఖ్యంగా నిమజ్జనకు నగర వాసులే కాదు.. పొరుగు జిల్లాల నుంచి కూడా పెద్దఎత్తున జనం రానున్నారు.
Read also: BRS Meeting: నేడు గాంధీ నివాసంలో బీఆర్‌ఎస్ విస్తృత స్థాయి సమావేశం.. భేటీపై ఉత్కంఠ..
ఖైరతాబాద్‌లో వినాయకుని నిమజ్జనాన్ని చూసేందుకు ప్రజలు విశేషంగా ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే ఈ నిమజ్జనానికి నగరంలోకి ప్రైవేట్ వాహనాలు, ప్రత్యేక వాహనాలకు అనుమతి లేదు. ఎందుకంటే ఆ రోజు నగరంలో భారీ ఊరేగింపుల నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. వీటిని పరిగణనలోకి తీసుకున్న దక్షిణ మధ్య రైల్వే శాఖ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. నిమజ్జనోత్సవాల సందర్భంగా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రాత్రి వేళల్లో కూడా ఈ ఎంఎంటీఎస్ ప్రత్యేక సర్వీసులను నడుపుతామని అధికారులు ప్రకటించారు.సెప్టెంబర్ 17, 18 తేదీల్లో ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయని.. తెల్లవారుజామున 4 గంటల వరకు ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయని తెలిపారు.
Read also: Arekapudi Gandhi: ఇవాళ గాంధీ ఇంటికి వస్తానని కౌశిక్ రెడ్డి సవాల్.. పోలీసులు భారీ బందోబస్తు
MMTS ప్రత్యేక రైళ్ల వివరాలు:
17వ తేదీ మధ్యాహ్నం 23:10 గంటలకు హైదరాబాద్ నుంచి లింగంపల్లికి
17వ తేదీ మధ్యాహ్నం 23:50 గంటలకు సికింద్రాబాద్ నుంచి హైదరాబాద్
18వ తేదీ ఉదయం 00:10 గంటలకు లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా
హైదరాబాద్ నుంచి లింగంపల్లికి 18వ తేదీ ఉదయం 00:30 గంటలకు
18వ తేదీ మధ్యాహ్నం 01:50 గంటలకు లింగంపల్లి నుంచి హైదరాబాద్
18వ తేదీ మధ్యాహ్నం 02:20 గంటలకు ఫలక్‌నుమా నుండి సికింద్రాబాద్‌కు.
18వ తేదీ మధ్యాహ్నం 03:30 గంటలకు హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్
18వ తేదీ సాయంత్రం 04:00 గంటలకు సికింద్రాబాద్ నుండి హైదరాబాద్
Chhattisgarh: మావోల ఘాతుకం.. ఇన్ఫార్మర్ల నెపంతో ఇద్దరు హత్య