MLC Madhusudanachary: కవితను ఐదు నెలలు కుట్రతో జైలులో పెట్టారని ఎమ్మెల్సీ మధుసూధనాచారి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ను రాజకీయంగా దెబ్బకొట్టాలని కవితను అరెస్టు చేశారన్నారు. ఈడీ, సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. కవితను ఐదు నెలలు కుట్రతో జైలులో పెట్టారన్నారు. మొక్కవోని దీక్షతో ఆమె 5 నెలలకు పైగా జైల్ లో పెట్టినా కూడా ధైర్యంగా నిలబడ్డారన్నారు. ఆమె ధీర వనితలా… కడిగిన ముత్యం లా ఆమె ఈనాడు బెయిల్ మీద బయటకు వస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి ఆయన స్థాయిలో మాట్లాడాలన్నారు. మెచ్యూర్డ్ పొలిటీషియన్ లాగా రేవంత్ మాట్లాడ్డం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా రేవంత్ పరిపక్వత పెంచుకోవాలన్నారు. ఆయన మంచి పాలన అందించాలని కోరుకుంటున్నామని తెలిపారు. అన్నిటికీ కాలమే సమాధానం చెబుతుందన్నారు. రేపటి రోజు మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందన్నారు.
Read also: MLC Kavitha: ఇవాళ జైలు నుంచి కవిత విడుదల..
మరోవైపు బీఆర్ఎస్ నాయకుడు దేవి ప్రసాద్ మాట్లాడుతూ.. సుప్రీం కోర్ట్ బెయిల్ ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. కుట్రపూరితంగా కవిత పై కేసు పెట్టారన్నారు. దుర్మార్గంగా వారిని అరెస్ట్ చేసారన్నారు. మా మీద ఆరోపణలు చేసిన వారందరికీ ఈ తీర్పు ఒక్క చెంపపెట్టు అన్నారు. తెలంగాణ ఉద్యోమ సమయంలో బతుకమ్మని ప్రపంచానీకి తెలియజేశారు కవిత అని తెలిపారు. కాంగ్రెస్ నాయకుడు మహేష్ గౌడ్ సుప్రీం కోర్ట్ ని తప్పుబడుతున్నారా?? కాంగ్రెస్ నాయుకులు సుప్రీం కోర్ట్ ని కూడా తప్పుబాడుతున్నారా ?? అని ప్రశ్నించారు.
Read also: MLC Kavitha: ఇవాళ జైలు నుంచి కవిత విడుదల..
ఎమ్మెల్సీ మధుసూదన్ చారి మాట్లాడుతూ.. సుప్రీం కోర్ట్ బెయిల్ ఇవ్వడాని స్వాగతిస్తున్నామన్నారు. అన్యాయంగా కవితని అరెస్ట్ చేశారన్నారు. కడిగిన ముత్యంలా కవిత బయటకు వస్తున్నారన్నారు. బీఆర్ఎస్ పైన ప్రజలు నమ్మకం పెరుగుతుంది, ప్రభుత్వం పైన వ్యతిరేకత వచ్చింది కాబట్టే వారు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారన్నారు. మాకు ఎవరితో లోపాయకార ఒప్పందం లేదన్నారు. కక్ష్య సాధింపు చర్యలు భాగంగా కవితని అరెస్ట్ చేసారన్నారు. ముఖ్యమంత్రి ఒక్కోసారి ఒక్కో విధంగా మాట్లాడతారు, ముఖ్యమంత్రి స్థాయి ఏంటో తెలుసుకోవాలని మండిపడ్డారు.
Patnam Mahender Reddy: నిబంధనల ప్రకారమే బిల్డింగ్ నిర్మించాం..