NTV Telugu Site icon

MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు బెయిల్‌..

Mlc Kvitha Bails

Mlc Kvitha Bails

MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై ఉత్కంఠకు తెరపడింది. కవితకు బెయిల్ మంజూరైంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి.. తిహాద్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కవిత బెయిల్ పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఢిల్లీ లిక్కర్ కేసులో విజయ్ నాయర్ బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడడంతో కవిత బెయిల్ పిటిషన్ ఏమవుతుందోనని బీఆర్ ఎస్ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. ఎట్టకేలకు బెయిల్ రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కవిత తరపున ముకుల్ రోహత్గీ వాదించారు. ఈ కేసులో సహ నిందితుడు మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరైంది. ఈ కేసులో ఇప్పటికే ఈడీ, సీబీఐ చార్జిషీటు దాఖలు చేశాయి. ఇప్పటికే విచారణ పూర్తయింది. ఈ కేసులో 57 మంది నిందితులు ఉన్నారు. ఢిల్లీలో సంచలనం సృష్టించిన మద్యం కేసులో కవితను మార్చి 16న ఈడీ అరెస్ట్ చేసింది. ఆ సమయంలో మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద అరెస్టు చేసినట్లు ఈడీ ప్రకటించింది. విచారణ అనంతరం ఆమెను తీహార్ జైలుకు తరలించారు. అప్పటి నుంచి ఆమె తీహార్ జైలులో ఉన్నారు. కొన్నాళ్ల క్రితం ఆమె జైలు నుంచి విడుదలైంది.