NTV Telugu Site icon

MLC Kavitha: ఇవాళ జైలు నుంచి కవిత విడుదల..

Kavitha

Kavitha

MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ సీబీఐ, ఈడీ కేసుల్లో కవితకు బెయిల్‌ మంజూరు చేసింది ధర్మాసనం. పలు షరతులతో కూడిన బెయిల్‌ ను మంజూరు చేసింది. ఇవాళ ఎట్టకేలకు సాయంత్రం 5 గంటల లోపు కవిత విడుదల కానున్నారు. రూ.10 లక్షల విలువైన 2 షూరిటీలు సమర్పించాలని సుప్రీం ఆదేశించింది. సాక్షులను ప్రభావితం చేయొద్దని తెలిపింది. కవిత పాస్‌పోస్ట్‌ ను అప్పగించాలని సుప్రీంకోర్టు తెలిపింది. కవిత బెయిల్‌ కు 3 ప్రధాన కారణాలు సుప్రీం కోర్టు తెలిపింది. మహిళకు ఉండే హక్కులను కూడా పరిగణించాల్సిన అవసరం ఉందని ధర్మాసనం పేర్కొంది. నిందితురాలని జైలులో ఉంచాల్సిన అవసరం లేదని తెలిపింది. సీబీఐ తుది ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసిందని, ఈడీ ఛార్జ్‌ షీట్‌ వేయలేదని తెలిపింది. ఇక ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో 166 రోజులు కవిత తిహార్ జైలులో ఉన్న విషయం తెలిసిందే.

Read also: MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు బెయిల్‌..

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి.. తిహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కవిత బెయిల్ పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. కవిత తరపున ముకుల్ రోహత్గీ వాదించారు. మార్చి 15 న ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అంతకు ముందు.. పది రోజుల ముందు ఈడి నోటీసులు ఇచ్చింది. దీని విచారణకు కవిత హాజరు కాలేదు.. 2022 జులై లో లిక్కర్ స్కామ్ వెలుగు లోకి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దాదాపు 5 నెలల తర్వాత మొదటిసారిగా సీబీఐ కవితను విచారించింది. 2022 డిసెంబర్ 11న కవిత ఇంట్లోనే విచారించింది సీబీఐ. లిక్కర్ స్కామ్ లో సి ఆర్ పి సి 160 కింద 7 గంటల పాటు వాంగ్మూలం నమోదు చేసి చేసింది. 2023 మార్చ్ 11న మొట్టమొదటిసారిగా ఈ డి విచారణకు కవిత హాజరైంది. ఆ తర్వత 16, 20, 21 న ఢిల్లీలో కవితను ఈడీ విచారించింది. తన ఎనిమిది ఫోన్లని ఈడి కి కవిత సమర్పించింది. ఈడి, సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో కవిత పేరు ప్రస్తావన వచ్చింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ 50 కింద స్టేట్మెంట్ రికార్డ్ చేసింది ఈడీ.

Read also: Patnam Mahender Reddy: నిబంధనల ప్రకారమే బిల్డింగ్ నిర్మించాం..

జనవరి 5న కవితకు మళ్ళీ ఈడి నోటీసులు ఇచ్చింది. మహిళను వ్యక్తిగతంగా విచారానికి పిలవడాన్ని సుప్రీంకోర్టు కవితలో సవాల్ చేసింది. ఢిల్లీ లిక్కర్స్ స్కామ్ లో ఫిబ్రవరి 21న కవితకు సిబిఐ నోటీసులు ఇచ్చింది. ఫిబ్రవరి 26న వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని నోటీసులో సీబీఐ పేర్కొంది. 41 సిఆర్పిసి నోటీసులు ఇచ్చింది. తొలిసారిగా నిందితురాలుగా చేర్చింది. సుప్రీం కోర్టులో కేసు విచారణ ఉంది…నేను రాలేను అని రిప్లై ఇచ్చింది. ఈరోజు సుప్రీం కోర్టులో విచారణ ఉండగా అది ఈనెల 19 కి వాయిదా పడింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కు సంబందించి సౌత్ గ్రూప్ కు కవిత నేతృత్వం వహించారనేది ప్రధాన ఆరోపణ కాగా.. ఇటీవల మాగుంట రాఘవ అప్రూవర్ గా మారిన విషయం తెలిసిందే.. గతంలో ఇదే కేసులో దినేష్ ఆరోరా.. గోరుంట్ల బుచ్చిబాబు.. అరుణ్ రామచంద్ర పిళ్ళై.. అప్రూవర్ గా మారిన విషయం తెలిసిందే.
Tummala Nageswara Rao: రైతు రుణ మాఫీ పై యాప్ పని ప్రారంభించింది..

Show comments