Minister Seethakka: బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభలో కేసీఆర్ స్పీచ్ చూసాకా… ఓ నియంత అధికారం పోయాక ప్రజల దగ్గరికి వచ్చి కన్నీళ్ళు పెట్టుకున్నట్టు ఉంది అని మంత్రి సీతక్క ఎద్దవా చేశారు. బాధ ఎవరి కోసం.. అధికారం పోయిందని బాధ తప్పితే ఇంకేం బాధ అని ప్రశ్నించింది. నీ కుటుంబంలో చీలికలు వస్తున్నాయని బాధనా.. తప్పుడు వెదవలు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తే తప్పకుండా కేసులు పెడతాం.. నీ బిడ్డ అంటే.. బస్సు ఎక్కదు.. పేద ఆడబిడ్డల బస్సు వద్దు అంటున్నావు.. పోలీసులను బెదిరిస్తున్నావు అని మంత్రి సీతక్క విమర్శించింది.
Read Also: Kunamneni Sambasiva Rao: అగ్నిప్రమాదానికి గురై దగ్దమైన ఇండ్లకు లక్ష రూపాయలు ఇవ్వాలి..
ఇక, నీ అంత దరిద్రంగా పోలీసులను వాడుకోలేదు అని మంత్రి సీతక్క పేర్కొనింది. ఫాంహౌస్ లో పెట్టుకుంటావ్ వాళ్ళను.. పదేళ్లలో ధర్నా చౌక్ కూడా ముసేశావు.. ఇప్పుడు మేము ధర్నా చౌక్ ఓపెన్ చేస్తే.. నీ కొడుకు, బిడ్డ ధర్నాలు చేస్తున్నారు అని సెటైర్లు వేసింది. సభ మేము అడ్డుకుంటే జరిగేదా..
సభ స్థలంలో కాలువలు ఉన్నాయి.. వాటిని పూడ్చేశావు.. అయినా సభ నీ మేము అడ్డుకోలేదు.. ఇబ్బంది పెట్టలేదు అని తేల్చి చెప్పింది. అధికారం లేకుంటే సభకు రాను అనే వాడివి నువ్వేం నాయకుడివి అని సీతక్క మండిపడింది.
