Minister Seethakka: ఫుడ్ పాయిజన్ వెనుక కుట్ర ఉందని మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో పలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఫుడ్ పాయిజన్ ఘటనలు రాజకీయ రగడకు దారితీసింది. తాజాగా ఫుడ్ పాయిజన్ తో విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయంపై సీతక్క స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫుడ్ పాయిజన్ వెనుక కుట్ర ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. కుట్ర వెనక ఎవరున్నారు అనేది బయట పెడతామని అన్నారు. కుట్ర దారులు వెనక అధికారులు ఉంటే.. ఉద్యోగాలు తీసేస్తాం అని హెచ్చరించారు. ఇందులో రాజకీయ పార్టీ కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు.
Read also: Bhudaan Lands: డిసెంబర్ 6న హాజరు అవ్వండి .. ఎమ్మార్వోతో పాటు నలుగురికి నోటీసులు..
దిలావత్‌పూర్ పరిశ్రమకు అనుమతి ఇచ్చింది బీఆర్ఎస్- సీతక్క ఆగ్రహం..
ఇక దిలావత్‌పూర్ పరిశ్రమ ఘటనపై మంత్రి మాట్లాడుతూ.. దిలావర్ పూర్‌లో పరిశ్రమకు అనుమతి ఇచ్చింది బీఆర్ఎస్ అని గుర్తుచేశారు. 2023 లోనే అనుమతి ఇచ్చారని మంత్రి స్పష్టం చేశారు. ఇథనాల్ కంపనీకి అనుమతి ఇచ్చింది బీఆర్ఎస్-బీజేపీ అన్నారు. ప్రజల అభిప్రాయాలు కూడా తీసుకోకుండా అనుమతి ఇచ్చింది కేటీఆర్ అన్నారు. నిశీగ్గుగా మాపై నిందలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇథనాల్ కంపెనీలో డైరెక్టర్లుగా మాజీ మంత్రి తలసాని కుమారుడు తలసాని సాయి ఉన్నాడని తెలిపారు. ఎక్కడెక్కడో తిరుగుడు ఎందుకు కేటీఆర్.. దిలావర్ పూర్ పోదాం రండి అని అన్నారు. చిల్లర రాజకీయాలు ఆవసరమా..? కేటీఆర్ అని మండిపడ్డారు. డ్రామాలు ఆడటం మానుకోవాలని సూచించారు.
Read also: BRSV State Secretary: బీఆర్ఎస్‌వీ స్టేట్ సెక్రటరీ నాగారం ప్రసాద్ అరెస్ట్..
విచ్చల విడిగా గ్రామ సభలు లేకుండా అనుమతి ఎలా ఇచ్చారని కేటీఆర్ పై మండిపడ్డారు. తలసాని వియ్యకుండు మరో భాగస్వామి అన్నారు. మీ తప్పులు కప్పిపుచ్చుకుని మాపై నిందలు మోపడం కరెక్ట్ కాదన్నారు. కేటీఆర్..నీకు చిత్తశుద్ధి అంటే దిలావర్ పూర్ కి రా..? అని సవాల్ విసిరారు. కడప వాళ్లకు కంపనీకి ఇచ్చింది కేటీఆర్ అని సీతక్క తెలిపారు. అన్నీ వివరాలు బయట పెడతామన్నారు. కేటీఆర్‌కు నీతి.. రీతి..జాతీ ఉంటే కంపనీకి అనుమతి ఇచ్చింది నువ్వే అని ఒప్పుకోవాలని అన్నారు. అసెంబ్లీ లో దీనిపై చర్చ చేస్తామన్నారు. స్పీకర్ ముందు చర్చ పెడతామని తెలిపారు. రేపు మీరు ఇచ్చిన అనుమతి వివరాలు బయట పెడతామని సీతక్క తెలిపారు.
CM Revanth Reddy: కుల సర్వేలో కుటుంబ వివరాలు నమోదు చేసుకున్న సీఎం..