Site icon NTV Telugu

Ponnam Prabhakar: జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్పై దాడిని ఖండించిన మంత్రి..

Ponnam

Ponnam

జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్ పై జరిగిన దాడిని రవాణా శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. ఏమైనా ఇబ్బంది ఉంటే పోలీసులకు కంప్లైంట్ చేసుకోవాలి.. కానీ ఇలా అధికారుల మీద దాడులు చేయడం పద్దతి కాదని మంత్రి చెప్పుకొచ్చారు. ఉద్యోగులపై దాడులు సరికాదు.. రవాణా శాఖ మంత్రిగా ఉద్యోగులకు అండగా ఉంటామని పొన్నం ప్రభాకర్ తెలిపారు.

Read Also: HIV-positive: “నిత్య పెళ్లికూతురి”కి హెచ్ఐవీ పాజిటివ్.. అధికారుల ఉరుకులు పరుగులు..

ఇక, జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్ పై జరిగిన దాడి ఘటనపై పోలీస్ అధికారులతో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. దాడి చేసిన వ్యక్తిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. జేటీసి రమేష్ పై దాడి చేసిన వ్యక్తిపై ఇప్పటికే కేసు నమోదు చేసినట్లు పోలీసులు మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకొచ్చారు. భవిష్యత్ లో మరోసారి అధికారులపై దాడి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు. ఉద్యోగులు అధైర్యపడవద్దని తమకు అండగా ఉంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు.

Exit mobile version