బీసీల సర్వేపై ఎవడో చెప్పే కాకి లెక్కలు నమ్మొద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. బీసీల సర్వేపై పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. సర్వేపై పొరపాట్లు ఉంటే చెప్పండి.. సరిదిద్దుతామన్నారు. బీహార్‌లో సర్వే చేస్తే ఇప్పటివరకు నివేదిక ఇవ్వలేదని తెలిపారు. మేము ఏడాదిలో చేసిన సర్వే నివేదిక బయటకు ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు. బయట మమ్మల్ని అడుగుతున్న వాళ్లు కూడా బీసీ బిడ్డలే అన్నారు. వేరే వాళ్ల ట్రాప్‌లో పడకుండా పొరపాట్లు ఉంటే చెప్పాలని… సరిదిద్దుతామని పేర్కొన్నారు. ఎవడో చెప్పే కాకి లెక్కలు మాత్రం నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు.
బీసీ సంఘాలు వస్తే సర్వేపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని పేర్కొన్నారు. మేధావులు ఈ అంశానికి అన్యాయం చేసే పని చేయొద్దని కోరారు. తాము కూడా బీసీ ఉద్యమాలు చేసినవాళ్లం.. మా వర్గాలకు న్యాయం చేయాలని ఉండదా? పదేళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉండి బీసీలకు ఎంత న్యాయం చేశారని అడిగారు. చార్మినార్‌కి వస్తారా? ప్రమాణం చేసి చర్చిద్దామన్నారు. సర్వే చేస్తున్నప్పుడు.. బీసీ సంఘాలను పిలిస్తే.. ఒక్కరూ రాలేదని చెప్పారు.