NTV Telugu Site icon

Minister Ponguleti: రౌడీయిజం సరికాదు.. కట్టడి చేయండి

Pongulety

Pongulety

Minister Ponguleti: సభలో బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు ప్రవర్తించిన తీరు బాధాకరమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. దళితెడూర స్పీకర్‌ పట్ల బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు ఇలా ప్రవర్తించడం సమంజసమేనా? అని ప్రశ్నించారు. రౌడీయిజం చేయడం సరికాదన్నారు. దీన్ని కట్టడి చేయాలన్నారు. ఒక ఎమ్మెల్యే కేసు గురించి ఇలా చేయడం సరికాదన్నారు. స్పీకర్‌ పోడియం వద్దకు వెళ్లి బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు పేపర్లు విసిరేయడం కరెక్ట్‌ కాదన్నారు. ఇది స్పీకర్‌ కు అవమానించడమే అన్నారు. సభ అనంతరం చాంబర్‌కు పిలుస్తానని స్పీకర్‌ చెప్పిన బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు అలా ప్రవర్తించడం బాధాకరం అన్నారు.

Read also: Harish Rao Vs Speaker: ఒక సభ్యుని కోసం సభా సమయం వృధా చేయడం కరెక్ట్ కాదు

మరోవైపు మంత్రులు అసెంబ్లీలో లేరని మాజీ మంత్రి హరీశ్ రావు అనడం అన్యాయమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తాను సభలో ఉన్నానని.. నేను మంత్రినేనని గమనించాలని అన్నారు. హరీష్‌ రావు వ్యాఖ్యలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. 2020 ఆర్ఓఆర్ చట్టం వల్ల లక్షలాది మంది రైతులు నష్టపోయారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నష్టపోయిన రైతులందరికీ భరోసా కల్పించేందుకు కొత్త చట్టం తెస్తున్నామని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌ సభ్యుల ఆందోళన మధ్య మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆర్‌ఓఆర్‌ 2024 చట్టంపై సభలో మాట్లాడారు.

Read also: KTR: కేసు విషయంలో నేనేం భయపడడం లేదు..

కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ధరణి లాంటి చట్టం గత రాచరికంలోనూ ఉండేదన్నారు. ఎవరైనా తప్పు చేస్తే అమాయకులు శిక్ష అనుభవిస్తారని అన్నారు. సిద్దిపేట జిల్లాలో ధరణి తప్పుడు రికార్డుతో మద్దెల కిష్టయ్య అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు. గత హయాంలో దళితులు, గిరిజనులు, మైనార్టీలు, బీసీలకు చెందిన వేలాది ఎకరాల భూములను ధర్నాలు తీసుకొచ్చి లాక్కెళ్లారని ఆరోపించారు. తాము తీసుకువస్తున్న భూభారతి నిజమైన ప్రజల చట్టమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.
Maheshwar Reddy: కేసీఆర్‌ పేదల భూములు లాక్కున్నారన్న కాంగ్రెస్‌.. లాభ పడింది ఎవరో చెప్పడం లేదు..