NTV Telugu Site icon

Damodar Raja Narasimha: మాదిగలు ఎవరికి వ్యతిరేకం కాదు.. అందరం సమానమే..!

Damodhar

Damodhar

Damodar Raja Narasimha: కాంగ్రెస్ మాదిగ ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. మంత్రి దామోదర రాజనర్సింహ అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగింది. సుప్రీం కోర్టు తీర్పు అమలుపై చర్చ జరిగింది. ఈ మీటింగ్ కు మాజీ ఎమ్మెల్యేలు, ఉద్యమ నాయకులు సైతం హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు తీర్పు చారిత్రాత్మక తీర్పు అని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం తెలంగాణలో అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు.. మాదిగ జాతి మొత్తం సీఎంకి రుణపడి ఉంటది.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుప్రీం కోర్టులో సీనియర్ అడ్వకేట్ నీ పెట్టారని మంత్రి దామోదర రాజనార్సింహ వెల్లడించారు.

Read Also: Building Collapse : కుప్పకూలిన బిల్డింగ్.. 12 మందికి గాయాలు.. విచారణకు ఆదేశించిన మేజిస్ట్రేట్

ఇక, మాదిగలకు న్యాయం జరగాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.. మాదిగలు ఎవరికి వ్యతిరేకం కాదు.. అందరం సమానమే అని మంత్రి దామోదర రాజనార్సింహా పేర్కొన్నారు. వర్గీకరణపై సీనియర్ అడ్వకేట్లతో అధ్యయనం చేయిస్తాం.. కమిటీ వేసి ఆర్డినెన్సు తేమని ముఖ్యమంత్రిని అడుగుతాం.. సీఎం రాగానే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి.. మాదిగ సమ్మేళనం, సభలు నిర్వహిద్దం.. దానికి సీఎంనీ పిలిచి సన్మానిద్దం అన్నారు. చర్మకారుల మొదటి సంఘం పెట్టింది మా నాన్న.. మేము చెప్పుకోము.. కొందరు చెప్పుకుంటారు అదే తేడా అని మంత్రి దామోదర రాజనార్సింహా చెప్పుకొచ్చారు.