NTV Telugu Site icon

Hyderabad Metro: ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ వరకు మెట్రో పనులకు శ్రీకారం..

Hyderabad Metro

Hyderabad Metro

Hyderabad Metro: హైదరాబాద్ నగర ప్రజలకు మెట్రో అధికారులు శుభవార్త అందించారు. మెట్రో రైల్ ఫేజ్ 2 పనులను ప్రారంభించేందుకు మెట్రో కార్పొరేషన్ శ్రీకారం చుట్టింది.. ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు మెట్రో లైన్ పొడిగించాలని నిర్ణయం తీసుకున్న ప్రయాణికులకు శుభవార్త. ఇప్పటి వరకు మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వరకు మాత్రమే మెట్రో అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు దాదాపు 7 కిలోమీటర్ల మేర మెట్రోను పొడిగించేందుకు మెట్రో సంస్థ శ్రీకారం చుట్టింది. ప్రతి కిలోమీటరుకు ఒక స్టేషన్‌ను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉంది.

Read also: Fake Ginger Garlic Paste: పెరుగుతున్న నకిలీ ఉత్పత్తులు.. 7.3 టన్నుల అల్లం పేస్ట్ స్వాధీనం

మరోవైపు ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ మీదుగా హైవే విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరోవైపు ఫ్లైఓవర్ నిర్మాణ పనులను కూడా ప్రారంభించనున్నారు. కాగా.. నగరంలో మెట్రో రెండో దశలో మొత్తం 70 కిలోమీటర్ల మేర నిర్మించాలని నిర్ణయించారు. అందులో భాగంగానే ఎల్బీ నగర్ – హయత్ నగర్ ఎంపికైంది. ఎల్ బీ నగర్ నుంచి చింతల్ కుంట, ఆటో నగర్, వనస్థలిపురం, మహావీర్ నేషనల్ పార్క్, హయత్ నగర్ వరకు అన్ని ప్రాంతాల్లో స్టేషన్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అయితే స్టేషన్ పాయింట్ ఎక్కడ ఉంది? స్టేషన్ల పేర్లకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ మార్గంలో మెట్రో సేవలు అందుబాటులోకి వస్తే గంటల్లో ప్రయాణం వేగంగా, సౌకర్యంగా ఉంటుందని నగరవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
CM Revanth Reddy: జూలై 16న కలెక్టర్లు, ఎస్పీలతో రేవంత్‌ రెడ్డి సమావేశం.. తొమ్మిది అంశాలపై చర్చ..