ACB Raid: రూ. 6 లక్షలకు బేరం.. రూ. 3 లక్షలు లంచం తీసుకుంటూ దొరికిపోయిన ఇన్స్పెక్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ACB Raid: హైదరాబాద్ పాతబస్తీలోని ఓ సివిల్ వివాదంలో తలదూర్చి, సెటిల్మెంట్ పేరిట భారీగా లంచం డిమాండ్ చేసిన మీర్‌చౌక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కొండల్‌రావుతో పాటు ఓ కానిస్టేబుల్‌ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బాధితుడి నుంచి రూ. 3 లక్షల లంచం తీసుకుంటుండగా అధికారులు వలపన్ని పట్టుకున్నారు.
రూ. 10 లక్షల డిమాండ్.. రూ. 6 లక్షలకు ఒప్పందం
పోలీసు వర్గాలు, ఏసీబీ తెలిపిన వివరాల ప్రకారం.. పాతబస్తీ పరిధిలోని ఓ స్థలానికి సంబంధించిన సివిల్ వివాదంలో ఇన్స్పెక్టర్ కొండల్రావు జోక్యం చేసుకున్నారు. ఈ వ్యవహారాన్ని అనుకూలంగా పరిష్కరించేందుకు బాధితుడి నుంచి తొలుత రూ. 10 లక్షలు డిమాండ్ చేశారు. బాధితుడు అంత మొత్తం ఇవ్వలేనని వేడుకోవడంతో, చివరికి రూ. 6 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా మొదటి విడతగా (టోకెన్ అమౌంట్) రూ. 3 లక్షలు వెంటనే చెల్లించాలని ఆదేశించారు.
Also Read
- ACB Raids : మీర్‌చౌక్ ఇన్స్పెక్టర్కు ఏసీబీ షాక్.. రూ.3 లక్షలు తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు
- Train Accident: చెవిలో ఇయర్‌ఫోన్స్.. వెనుక రైలు.. క్షణాల్లో ప్రాణం బలి!
- Hyderabad: కాటేదాన్‌లో రసాయన పేలుడు: ఒకరికి తీవ్ర గాయాలు, మరొకరికి స్వల్ప గాయాలు..
- Police T20 Cricket Tournament : హైదరాబాద్‌లో పోలీసుల క్రికెట్ సందడి.. డిసెంబర్లో జాతీయ టోర్నీ!
షాపులో డబ్బులు తీసుకుంటుండగా పట్టివేత
బాధితుడు ఇన్స్పెక్టర్ వేధింపులు తాళలేక ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పక్కా ప్రణాళిక రచించిన అధికారులు మంగళవారం రంగంలోకి దిగారు. మీర్‌చౌక్ పరిధిలోని ఓ దుకాణంలో బాధితుడు రూ. 3 లక్షల నగదును ఇన్స్పెక్టర్ సూచన మేరకు అందిస్తుండగా, అప్పటికే మాటువేసిన ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటనతో సంబంధమున్న ఇన్స్పెక్టర్ కొండల్‌రావుతో పాటు ఒక కానిస్టేబుల్‌ను అధికారులు తక్షణమే అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పాతబస్తీలోని మీర్‌చౌక్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ బృందాలు విస్తృతంగా సోదాలు చేపట్టాయి. కేసు నమోదు చేసిన అధికారులు, నిందితులను ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు వెల్లడించారు. ఈ దాడితో పోలీస్ శాఖలో ఒక్కసారిగా కలకలం రేగింది.
తాజావార్తలు
-
ACB Raid: రూ. 6 లక్షలకు బేరం.. రూ. 3 లక్షలు లంచం తీసుకుంటూ దొరికిపోయిన ఇన్స్పెక్టర్
-
ACB Raids : మీర్‌చౌక్ ఇన్స్పెక్టర్కు ఏసీబీ షాక్.. రూ.3 లక్షలు తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు
-
Arnab Cyclone: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. ఇళ్లలోకి సముద్రపు నీరు, అష్టదిగ్బంధంలో అమలాపురం!
-
Venkatesh : గతంలో ప్రేమించా.. కానీ ఇప్పుడు నా ఫ్యామిలీ జోలికొస్తే వదలను!
-
Train Accident: చెవిలో ఇయర్‌ఫోన్స్.. వెనుక రైలు.. క్షణాల్లో ప్రాణం బలి!
ట్రెండింగ్
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!