Fire Accident: జీడిమెట్ల ధూలపల్లి రోడ్డులోని ఎస్‌ఎస్‌వీ ఫ్యాబ్స్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఫ్యాక్టరీలోని మూడు అంతస్తులు అగ్నికి ఆహుతయ్యాయి. అందులో ఒక భవనం కుప్పకూలింది. మంటలు చెలరేగిన వెంటనే ఫ్యాక్టరీలోని కార్మికులంతా బయటకు పరుగులు తీసి ప్రాణాలు నిలబెట్టుకున్నారు. పరిశ్రమలో మొత్తం 500 మంది కార్మికులు ఉండగా.. మంగళవారం జనరల్ షిప్ట్ లో దాదాపు 200 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం.
జీడిమెట్ల పారిశ్రామికవాడలోని పాలిథిన్ సంచులు తయారయ్యే SSV ఫ్యాబ్ పరిశ్రమలో నిన్న మధ్యాహ్నం ప్రాంతంలో మంటలు చెలరేగాయి. దాదాపు రాత్రి 1 గంట ప్రాంతంలో 75 శాతం మూడంతస్తుల భవనం ధగ్ధమైంది. కింది అంతస్తులో భారీ మొత్తంలో ప్లాస్టిక్ కు సంబంధించిన ముడి సరుకు ఉండటంతో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. నిన్నటి నుండి మంటలను అదుపుచేసేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. మధ్యాహ్నం వరకు మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సుమారు 4 ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపు చేసేందుకు పోలీసులు శ్రమిస్తున్నారు. భారీ మంటల దాటికి మొత్తం నాల్గు అంతస్తులు కాలిబూడిదయ్యాయి. ఫైర్ సిబ్బంది సుమారు 50 మందికి పైగా అక్కడే వుండి మంటలను అర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. జీడిమెట్ల అగ్ని ప్రమాదం సమాచారం అందడంతో ఘటన వద్దకు బాలానగర్ ఏసీసీ హన్మంత ఆరవు, జీడిమెట్ల ఇన్పెక్టర్ గడ్డం మల్లేష్, ఎస్ఐలు చేరుకుని అక్కడ పరిస్థితిని పరిశీలించారు.
Komaram Bheem: నేడు కొమురం భీం జిల్లాలో విద్యాసంస్థల బంద్..