MNJ క్యాన్సర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో హైదరాబాదులోని లుంబిని పార్క్ నుంచి ఎంఎన్ జే క్యాన్సర్ ఆసుపత్రి వరకు నిర్వహించిన బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ క్యాంపెయిన్ అండ్ వాక్ ను రాష్ట్ర వైద్యారోగ్య , కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను ఎదుర్కోవడానికి ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడుతాయన్నారు. నాన్ కమ్యునికబుల్ డిసీజ్‌లు అన్నింటిలోకెల్లా క్యాన్సర్ అత్యంత ప్రమాదకరం.. క్రమశిక్షణ లేని జీవన విధానం సహా అనేక కారణాలు ఈ వ్యాధి ప్రబలడానికి కారణమవుతున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. ఇండియాలో ఏటా 14 నుంచి 15 లక్షల కేసులు నమోదవుతుంటే.. తెలంగాణలో 50 నుంచి 60 వేల కేసులు నమోదవుతున్నాయి.. క్యాన్సర్ గురించి అవగాహన లేకపోవడం వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు అని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.
Read Also: Dasaradh : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రీమేక్ కాదు..
ఇక, ప్రజలకు అవగాహన కల్పించి, ప్రాణ నష్టాన్ని నివారించాల్సిన బాధ్యత మనందరిది అని మంత్రి దామోదర్ రాజనర్సింహ చెప్పుకొచ్చారు. మహిళల్లో ఎక్కువగా బ్రెస్ట్ కేన్సర్ కేసులు నమోదవుతున్నాయి.. మొత్తం వుమెన్ క్యాన్సర్ బర్డెన్‌లో 14 శాతం బ్రెస్ట్ కేన్సర్ సంబంధిత కేసులే ఉంటున్నాయని డాక్టర్లు చెబుతున్నారు.. దీనిపై అవగాహన కల్పించి, స్క్రీనింగ్ చేస్తే ఎర్లీ స్టేజ్‌లో రోగ నిర్దారణ చేయొచ్చు అని వెల్లడించారు. తద్వారా కేన్సర్‌ను పూర్తిగా నయం అయ్యేలా ట్రీట్‌మెంట్ అందించొచ్చు.. ప్రతి మహిళా స్క్రీనింగ్ చేయించుకోవడానికి ముందుకు రావాలి.. ప్రభుత్వం ఉచితంగా స్క్రీనింగ్, ట్రీట్‌మెంట్ అందిస్తోంది.. ప్రతి గ్రామంలో మొబైల్ ల్యాబ్స్ ద్వారా ఉచితంగా స్క్రీనింగ్ చేయిస్తామని మంత్రి దామోదర్ పేర్కొన్నారు.
Read Also: Aravind Kejriwal : ప్రభుత్వ వసతి కల్పించాలని హైకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్
అలాగే, 6 క్యాన్సర్ రీజినల్ సెంటర్స్ ఏర్పాటు చేయబోతున్నామని హెల్త్ మినిస్టర్ రాజనర్సింహ చెప్పారు. ఈ సెంటర్లలో డాక్టర్లు, పూర్తి స్థాయిలో ఎక్విప్‌మెంట్ తీసుకొస్తాం.. ఈ సెంటర్లు అన్నింటికీ ఎంఎన్‌జే హాస్పిటల్ హబ్‌గా ఉంటుంది.. క్యాన్సర్ ట్రీట్‌మెంట్ ఒక్క రోజులోనో, ఒక్క వారంలోనో అయ్యేది కాదు, నెలలు, సంవత్సరాల తరబడి సాగుతుంది.. పేషెంట్లకు ఫిజికల్, మెంటల్, ఫైనాన్షియల్ సపోర్ట్ చాలా అవసరం.. దాని కోసమే పాలియేటివ్ రిహాబిలిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నాం.. డయాబెటీస్ క్లినిక్స్ ఏర్పాటు చేయబోతున్నామన్నారు.