Site icon NTV Telugu

Manik Rao Thakre : మనం కష్టపడితే అధికారం మనదే

Manikrao Thakre

Manikrao Thakre

పీపుల్స్‌ మార్చ్‌ పేరిట సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ రోజు భట్టి విక్రమార్క పాదయాత్ర 1000 కిలోమీటర్ల మైలురాయిని దాటింది. ఈ నేపథ్యంలో గాంధీ భవన్ లో ఏఐసీసీ ఇంఛార్జ్‌ మానిక్‌ రావు థాక్రే కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా మానిక్‌ రావు థాక్రే మాట్లాడుతూ.. నాయకులు క్షేత్ర స్థాయిలో గట్టిగా పని చేయాలన్నారు. రాబోయేది మన ప్రభుత్వమే.. మనం కష్టపడితే అధికారం మనదేనని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఎన్నికల వాతావరణం వచ్చేసిందని ఆయన అన్నారు.

Also Read : Varun Varuntej – Lavanya Tripathi : వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ లో హైలెట్గా నిలిచిన పవన్ కళ్యాణ్..
కేసీఆర్ రోజు ప్రజలకు అబద్ధాలు చెబుతూ ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. తనకు పేపర్, చానల్స్ ఉన్నాయి.. తను రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినట్టు, ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేసినట్టు ప్రచారం చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. రోజు ఒక వర్గానికి ఏవో ఇస్తున్నట్టు ప్రచారం చేస్తున్నారని, ఇవన్నీ పచ్చి అబద్దాలు.. వాటిని మీరు అవగాహన చేసుకొని వాస్తవాలను జనంలోకి తీస్కొని పోవాలన్నారు. ప్రజలకు అర్థం అయ్యే విదంగా, గట్టిగా వాస్తవాలను ప్రచారం చేయాలని, జనంలోనే ఉండాలి.. వాళ్లకు కేసీఆర్ చెప్తున్న అబద్దాలు వివరించాలన్నారు. మనం అధికారంలోకి వస్తే ఏమి చేస్తామో కూడా వివరించాలని ఆయన అన్నారు.

Also Read : Giriraj Singh: గాడ్సే ఈ దేశ పుత్రుడు.. ఔరంగజేబులా ఆక్రమణదారు కాదు.. ఓవైసీకి కేంద్రమంత్రి కౌంటర్

Exit mobile version