Kharge Slams BJP: పహల్గామ్ ఉగ్రదాడిని కాంగ్రెస్ పార్టీ ఖండించింది అని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని సమర్థించింది.. కానీ, బీహార్ ఎన్నికల ప్రచారంపై ఉన్న శ్రద్ధ.. నరేంద్ర మోడీకి దేశ భద్రతపై లేదని విమర్శలు గుప్పించారు. పహల్గామ్ ఉగ్రదాడిపై అన్ని దేశాలు తిరిగి.. కాంగ్రెస్ నేతలు ప్రచారం చేశారు అని పేర్కొన్నారు. పాక్‌ను అంతం చేస్తామని గొప్పలు చెప్పిన బీజేపీ నేతలు.. యుద్ధాన్ని ఎందుకు ఆపారు? అని ప్రశ్నించారు. ఇందిరాగాంధీ పాకిస్థాన్‌ను రెండు ముక్కలు చేశారు.. మరి, మోడీ ఏం చేశారు..? దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉంది.. గాంధీ కుటుంబంలో దేశం కోసం ప్రాణాలు ఇచ్చినవాళ్లు ఉన్నారు.. బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లో అలాంటి వాళ్లు ఉన్నారా..? 42 దేశాల్లో పర్యటించిన మోడీ.. మణిపూర్‌కి ఎందుకు వెళ్లడం లేదు? అని ఖర్గే అడిగారు.
Read Also: Mallikarjun Kharge: 11 ఏళ్లలో మోడీ తెలంగాణకు ఏం ఇచ్చారు..
అయితే, గతంలో అమెరికా యుద్ధా నౌకల్ని పంపించినా.. ఇందిరా గాంధీ బెదరకుండా యుద్ధాన్ని కొనసాగించారని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే తెలిపారు. 42 దేశాల్లో పర్యటించిన మోడీ.. మణిపూర్ కు ఎందుకు వెళ్లడం లేదో అర్థం కావడం లేదని చెప్పుకొచ్చారు. ఎన్నికలకు ముందు 15 లక్షల రూపాయలతో పాటు ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోడీ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాడు.. ఆ తర్వాత హామీలను తుంగలో తొక్కారని విమర్శించారు. కానీ, కాంగ్రెస్ పార్టీ ఏం చెబుతుందో అది చేసి చూపిస్తుందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను.. బీజేపీ నాశనం చేసిందని మల్లికార్జున ఖర్గే ఆరోపించారు.
