Malla Reddy: పార్టీ మార్పుపై మాజీ మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు..
Malla Reddy: బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి మల్లారెడ్డి పార్టీ మార్పు ప్రచారంపై తీవ్రంగా స్పందించారు. తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని స్పష్టం చేస్తూ సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాలను ఖండించారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ సమావేశానికి హాజరైన నేపథ్యంలో మల్లారెడ్డి పార్టీ మారబోతున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగింది. దీనిపై స్పందించిన ఆయన, ప్రధానిని కలిసినంత మాత్రాన పార్టీ మారినట్లు కాదని హితవు పలికారు.. తాను ఇప్పటికీ బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నానని మల్లారెడ్డి మరోసారి స్పష్టం చేశారు. నిరాధార ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన అవసరం తనకు లేదని వ్యాఖ్యానించారు.
Read Also: Redmi Pad 2: రెడ్మి ప్యాడ్ 2 టాబ్లెట్ విడుదల.. 7600mAh బ్యాటరీ, డ్యూయల్ స్పీకర్లు.. తక్కువ ధరకే
Also Read
పార్టీ మార్పు ప్రచారంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నలు అడిగిన సందర్భంగా కొంత ఆవేశంగా స్పందించిన మల్లారెడ్డి, సోషల్ మీడియా ప్రచారాలపై ప్రతి సారి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. మల్లారెడ్డి వ్యాఖ్యలతో ఆయన పార్టీ మార్పుపై వస్తున్న ఊహాగానాలకు తాత్కాలికంగా తెరపడినట్లైంది. అయితే, రాజకీయ వర్గాల్లో మాత్రం ఈ అంశంపై చర్చ కొనసాగుతోంది. మరోవైపు మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసలు గుప్పించారు. దీంతో ఆమె బీజేపీ వైపు అడుగేస్తారనే చర్చ మొదలైంది. ఇదిలా ఉండగా.. ప్రీతిరెడ్డి ఈ మధ్యే బీజేపీ పార్టీ ఆఫీస్‌కు వెళ్లారు ఇది కూడా పెద్ద చర్చగా మారిన విషయం విదితమే కాగా.. ఇది మర్యాదపూర్వక భేటీనేనని ప్రీతిరెడ్డి క్లారిటీ ఇచ్చారు.. మల్లారెడ్డి యూనివర్సిటీలో ఏఐ క్యాంపస్ ఓపెనింగ్‌కు ప్రధాని మోడీని ఆహ్వానించాం.. మోడీని ఆహ్వానించాం కాబట్టే ఆ పార్టీ నేతలను ఇప్పుడు కలుస్తున్నాం.. బీజేపీనే కాదు.. అన్ని పార్టీల నేతలను కలిసి ఆహ్వానిస్తున్నామంటూ ప్రీతిరెడ్డి స్పష్టం చేసిన విషయం విదితమే..
తాజావార్తలు
-
Malla Reddy: పార్టీ మార్పుపై మాజీ మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు..
-
Players Caught Vaping: మ్యాచ్ మధ్యలో ఈ-సిగరెట్ తాగుతూ కెమెరాకు చిక్కిన ప్లేయర్స్ వీళ్లే..
-
Arshdeep Singh Trolls: రీల్స్, గర్ల్‌ఫ్రెండ్‌పై కాదు.. బౌలింగ్‌పై దృష్టి పెట్టు సింగ్ సాబ్!
-
Rs 397 Crore Transformer Scam: ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో రూ.397 కోట్ల స్కామ్.. సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశాలు..
-
Redmi Pad 2: రెడ్మి ప్యాడ్ 2 టాబ్లెట్ విడుదల.. 7600mAh బ్యాటరీ, డ్యూయల్ స్పీకర్లు.. తక్కువ ధరకే
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో