Kishan Reddy: జూబ్లీహిల్స్ లో మేము ఎప్పుడూ ఒక కార్పొరేటర్ కూడా గెలవలేదు.. స్వాతంత్రం వచ్చినప్పుడు నుంచి ఎప్పుడు గెలవలేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. తాము ఉన్నంతలో ప్రయత్నం చేశామని.. ఎంఐఎం మద్దతు, డబ్బుతోనే జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచిందన్నారు. ప్రత్యేక పరిస్థితులలో జూబ్లీహిల్స్ ఎన్నికలు జరిగాయని.. తమ పార్టీ అక్కడ బలహీనంగా ఉందన్నారు. ఓటమిని విశ్లేషించుకుంటామని తెలిపారు. ఓల్డ్ సిటీలో కూడా ఏ పార్టీ గెలవదన్నారు. ప్రజా తీర్పును మేము శిరసా వహిస్తాం..…
Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న వేళ విషాదం చోటుచేసుకుంది. అభ్యర్థిగా పోటీలో ఉన్న 40 ఏళ్ల మహమ్మద్ అన్వర్ గుండెపోటుకు గురై మరణించారు. ఎర్రగడ్డలో నివాసి అన్వర్ కౌంటింగ్ ప్రక్రియపై ఉత్కంఠ ఎదురు చూస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో అకస్మాత్తుగా ఛాతి నొప్పితో కుప్పకూలినట్లు తెలుస్తోంది. కుటుంబీకులు వెంటనే ఆస్పత్రికి తరలించినా అప్పటికే మరణించారని వైద్యులు ధృవీకరించారు.
Naveen Yadav: కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ లో 47 ఏళ్లలో ఎవరూ లోకల్ అభ్యర్థికి టికెట్ ఇవ్వలేదన్నారు.. ఈ ప్రాంతం నుంచి పోటీ చేసిన పీజేఆర్ ప్రజల్లో ఉంటూ గొప్ప నేతగా ఎదిగారన్నారు.. అయితే పీజేఆర్ కూడా నాన్ లోకల్ అంటూ జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘పీజేఆర్’గా పేదల గుండెల్లో నిలిచిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే పి. జనార్దన్‌రెడ్డి 2007లో పదవిలో ఉండగానే గుండెపోటుతో…
ఫోన్ ట్యాపింగ్ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో చిట్చాట్లో ఆయన మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్ కూడా విన్నారని అంటున్నారు.. సొంత కుటుంబ సభ్యుల ఫోన్ లే ట్యాపింగ్ చేసి వినాల్సిన పరిస్థితి వస్తే సూసైడ్ చేసుకోవడం ఉత్తమమని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ ఇల్లీగల్ కాదు..