NTV Telugu Site icon

Malla Reddy and Teegala Krishna Reddy: త్వరలో టీడీపీ గూటికి తీగల.. మరి మల్లారెడ్డి..?

Teegala Krishna Reddy

Teegala Krishna Reddy

Malla Reddy and Teegala Krishna Reddy: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ఈరోజు టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశం అయ్యారు మాజీ మంత్రి, బీఆర్ఎస్‌ సీనియర్‌ నేత మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఆయన అల్లుడైన మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి.. వారితో పాటు హైదరాబాద్‌ మాజీ మేయర్‌ తీగల కృష్ణారెడ్డి కూడా చంద్రబాబుతో భేటీ అయినవారిలో ఉన్నారు.. మర్రి రాజశేఖర్ రెడ్డి కూతురు వివాహానికి ఆహ్వానించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు.. అయితే, ఈ సందర్భంగా రాజకీయాలపై కీలక చర్చలు సాగినట్టుగా తెలుస్తోంది.. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో డీలా పడిన టీడీపీకి పూర్వ వైభవం తెచ్చేలా ముందు అడుగు పడబోతోంది.. దీనికి కారణం.. చంద్రబాబుతో భేటీ తర్వాత హైదరాబాద్‌ మాజీ మేయర్‌, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ నేత తీగల కృష్ణారెడ్డి ఇచ్చిన స్టేట్‌మెంట్‌ కారణంగా చెప్పుకోవచ్చు..

Read Also: Sanath Jayasuriya: అప్పటి వరకు శ్రీలంక ప్రధాన కోచ్‌గా సనత్ జయసూర్య

చంద్రబాబును కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన తీగల కృష్ణారెడ్డి.. త్వరలోనే టీడీపీలో చేరనున్నట్టు ప్రకటించారు.. హైదరాబాద్ అభివృద్ధి చెందింది అంటే తెలుగుదేశం, చంద్రబాబు వల్లనే సాధ్యమైందన్న ఆయన.. తెలంగాణలో ఇంకా టీడీపీ అభిమానులు చాలా మంది ఉన్నారు.. తెలంగాణలో టీడీపీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకొస్తాం అన్నారు.. తాను త్వరలో టీడీపీలో చేరనున్నట్టు వెల్లడించారు.. చంద్రబాబుతోనే నా రాజకీయ ప్రస్థానం మొదలైంది.. తెలంగాణ ఏర్పడిన తర్వాత అనేక కష్టాలను ఎదుర్కొని.. మరోసారి చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రి అయ్యారు.. ఆ నాటి ఎన్టీఆర్‌ పాలన మళ్లీ రావాలని.. తెలంగాణలో బడుగు, బలహీన వర్గాలను మళ్లీ అధికారం దక్కలనే చంద్రబాబును కలిశాం అన్నారు.. హైదరాబాద్‌ అభివృద్ధికి కృషి చేసింది చంద్రబాబే.. దానికి సాక్ష్యం నేనే అన్నారు.. నేను మేయర్‌గా ఉన్న సమయంలో హైదరాబాద్‌కు ఎన్నో అవార్డులు వచ్చాయని వెల్లడించారు.. ఈ సందర్భంగా మీడియా ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. త్వరలోనే టీడీపీలో చేరతానని ప్రకటించారు.

Read Also: Sanath Jayasuriya: అప్పటి వరకు శ్రీలంక ప్రధాన కోచ్‌గా సనత్ జయసూర్య

అయితే, టీడీపీలో వందశాతం చేరతానంటూ తీగల కృష్ణారెడ్డి ప్రకటించిన సమయంలో.. ఆయన పక్కనే మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి కూడా ఉన్నారు.. కానీ, ఈ వ్యవహారంపై స్పందించడానికి నిరాకరించారు మల్లారెడ్డి.. మీడియా వెంటబడి ప్రశ్నిస్తే.. తాను తన మనవరాలి పెళ్లికి ఆహ్వానించడానికే చంద్రబాబును కలిసినట్టు పేర్కొన్నారు.. కానీ, అంతా ఒకేసారి చంద్రబాబుతో సమావేశం అయ్యారు.. తీగల కృష్ణారెడ్డి.. టీడీపీ చేరడం ఖాయం అయిపోగా.. మల్లారెడ్డి అడుగులు ఎటువైపు పడతాయనేది చర్చగా మారింది.. టీడీపీలోనే రాజకీయ జీవితం ప్రారంభించిన మల్లారెడ్డికి.. ఆయన కుటుంబానికి టీడీపీ అధినేత చంద్రబాబుతో మంచి అనుబంధం ఉంది.. రాష్ట్రంలో చోటు చేసుకున్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో.. మల్లారెడ్డి.. ఆయన అల్లుుడు.. ఇలా ఆయన కుటుంబం మొత్తం ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరుతుందా? అనే చర్చగా హాట్‌ టాపిక్‌గా మారిపోయింది.. అయితే, ఇప్పుడు రాజకీయాల గురించి మాట్లాడను అని.. ఆ తర్వాత ఏదైనా ఉంటే చెబుతాం అంటూ మల్లారెడ్డి చెప్పినట్టుగా తెలుస్తోంది.. మొత్తంగా ఈ భేటీ తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసింది.. కాగా, టీడీపీలో ఉండి హైదరాబాద్‌ మేయర్‌గా పనిచేసిన తీగల కృష్ణారెడ్డి.. ఆ తర్వాత బీఆర్ఎస్‌లో చేరి.. మహేశ్వరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు.. ఇక, గత ఎన్నికల సమయంలో ఆయన.. కాంగ్రెస్‌ పార్టీకి దగ్గరయ్యారు.. ఇప్పుడు మరోసారి టీడీపీ చేరడం ఖాయమని స్పష్టం చేశారు..

Show comments