Mahesh Kumar Goud: సుప్రీంకోర్టు తీర్పు తో విద్యార్థులు హ్యాపీగా పరీక్షలు రాసుకోవాలని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని తెలిపారు. గ్రూప్ 1 పరీక్షలను వాయిదా వేయలేమని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు హర్షనీయమన్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో విద్యార్థులు హ్యాపీ గా పరీక్షలు రాసుకోవాలని సూచించారు. 13 ఏళ్ల తర్వాత ఒక మంచి అవకాశం వచ్చింది.. మంచిగా ఉపయోగించుకొని ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షిస్తున్నా అన్నారు. మేము మొదటి నుంచి గ్రూప్ 1 విద్యార్థులకు అండగా ఉన్నామన్నారు. ఇదే విషయాన్ని పదే పదే చెపుతూనే ఉన్నామని గుర్తు చేశారు. జీఓ 29 వల్ల రిజర్వేషన్లు అభ్యర్థులకు ఎలాంటి అన్యాయం జరగదని మరోసారి చెప్తున్నామని తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు వారి రాజకీయ లబ్ది కోసం గ్రూప్ 1 విద్యార్థులను పావుగా వాడుకున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read also: Malla Reddy Mass Dance: పెళ్లి సంగీత్ లో మల్లన్న మాస్ స్టెప్పులు..
నేటి నుంచి గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించాలన్న సుప్రీం కోర్టు తీర్పు పై కాంగ్రెస్ ప్రభుత్వం ఆనందం వ్యక్తం చేసింది. అభ్యర్థుల తరపున కపిల్ సిబాల్ వాదనలు విన్న సుప్రీం చివరకు పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. ఇంత వరకు వచ్చి ఇప్పుడు వాయిదా వేయడం మంచిది కాదని తెలిపింది. ఇందులో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. ఇలా చేయడం వలన అభ్యర్థుల ఇంత వరకు ప్రిపేర్ అయిన సిలబస్ అంతా వ్యర్థం అవుతుందని తెలిపారు. ఇది కరెక్ట్ పద్దతి కాదని తెలిపింది. గ్రూప్ 1 పరీక్ష యదావిధిగా కొనసాగించాలని తెలిపింది. మరోవైపు అభ్యర్థులు పరీక్ష కేంద్రాల వద్ద భారీగా చేరుకుని పరీక్ష రాసేందుకు సిద్దమయ్యారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి సంఘటనలు జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కేంద్రాల వద్దకు పోలీసులు భారీగా చేరుకున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.
Big Breaking: గ్రూప్ 1 పరీక్షలకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్..