NTV Telugu Site icon

Narayanpet Incident: విద్యార్థులు అస్వస్థత గురైన ఘటన.. హెడ్ మాస్టర్ సస్పెండ్..

Revanth Reddy

Revanth Reddy

Narayanpet Incident: నారాయణపేట జిల్లా మాగనూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నం భోజనం వికటించి 50 మంది విద్యార్థులకు అస్వస్థత గురైన ఘటన సంచలనంగా మారింది. సమారు 15 మంది విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. తీవ్ర అస్వస్థతకు గురైన వారందని మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ విషయం తెలిసిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ ఏం జరిగింది అనే దానిపై విచారణకు ఆదేశించారు. దీంతో అధికారులు మాగనూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ ను సస్పెండ్ చేశారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీ రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Read also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

కాగా..ఈ సంఘటనలో అస్వస్థతకు గురైన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని సీఎం రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. బాధిత విద్యార్థులకు వెంటనే మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సంఘటనకు దారి తీసిన కారణాలపై నివేదికను అందజేయాలని సీఎంవో అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని హెచ్చరించారు. వెంటనే అన్ని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేశారు. విద్యార్థులకు పౌష్ఠికాహారం అందించే విషయంలో రాజీ పడేది లేదని, ఎక్కడైనా ఇలాంటి ఘటనలు జరిగితే బాధ్యులపై కఠినంగా వ్యవహరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం స్థానిక మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ లో మధ్యాహ్నం సాంబార్ గుడ్లతో కూడిన భోజనం చేసిన విద్యార్థులకు కొద్ది నిమిషాల వ్యవధిలోనే అస్వస్థతకు గురయ్యారు. ఒక్కొక్క విద్యార్థి అపారమైన స్థితిలోకి వెళ్లడం..వాంతులు, విరోచనాలు, కడుపునొప్పి తో బాధపడ్డారు. ఉపాధ్యాయులకు విషయం తెలపడంతో విద్యార్థులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Fake Ration Cards: 98.7శాతం లబ్ధిదారుల ధ్రువీకరణ పూర్తి.. 5.8 కోట్ల నకిలీ రేషన్‌ కార్డుల గుర్తింపు