Site icon NTV Telugu

Lal Darwaza Bonalu: నేడే లాల్ దర్వాజా బోనాలు.. ధూం ధాం కి సిద్ధమైన పట్నం పోరగాళ్లు

Bonalu

Bonalu

Lal Darwaza Bonalu: తెలంగాణలోని అత్యంత ప్రాచీనమైన సాంస్కృతిక ఉత్సవాలలో బోనాల పండుగ ఒకటి. ఈ పండుగ దాదాపు 600 ఏళ్లకు పైగా చరిత్రను కలిగి ఉంది. హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో ప్లేగు వ్యాధి వ్యాప్తి చెందడంతో.. అనేక మంది ప్రజలు ఈ వ్యాధి బారిన పడి చనిపోయారు. ఈ సమయంలో, మిలిటరీ బెటాలియన్ జవానులు ఉజ్జయినిలోని మహంకాలి అమ్మవారిని ప్రార్థించి, ప్లేగు వ్యాధి తగ్గితే హైదరాబాద్‌లో ఆమెకు గుడి కట్టిస్తామని మొక్కుకోవడంతో.. ఆ తర్వాత ఈ వ్యాధి తగ్గింది.. ఇక, అప్పటి నుంచి సికింద్రాబాద్‌లో కాళీమాత అమ్మవారిని ప్రతిష్ఠించి బోనాలు వేడుకలు నిర్వహించడం అనావాయితీగా వస్తుంది. అలాగే, 1908లో ముసి నది వరద కూడా బోనాల పండుగ యొక్క ప్రాముఖ్యతను పెంచింది. వరదలో అనేక మంది ప్రాణాలు కోల్పోగా.. అప్పటి నిజాం, మీర్ మహబూబ్ అలీఖాన్, లాల్ దర్వాజా అమ్మవారి ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేసి, మూసి నదిలో పసుపు, కుంకుమ, గాజులు, పట్టు వస్త్రాలను సమర్పించినప్పటి నుంచి లాల్ దర్వాజాలోని సింహవాహిని ఆలయంలో ఆషాడ మాసపు చివరి ఆదివారం బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.

Read Also: Hansika : విడాకుల పుకార్లపై స్పందించిన హీరోయిన్ హన్సిక భర్త సోహైల్‌..

అయితే, లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఇవాళ (జూలై 20న) ఉదయం ఘనంగా ప్రారంభమైంది. అమ్మవారికి బోనాలని సమర్పించడానికి భారీగా భక్తులు భారీగా వస్తున్నారు. అమ్మవారిని దర్శించుకోవడానికి ఆలయానికి భక్తులు క్యూ కట్టడంతో పరిసర ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. బోనాలతో వచ్చే భక్తులకు ఆలయ అధికారులు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయగా.. అమ్మవారి పాటలతో ఆలయ పరిసరాలు మొత్తం సందడిగా మారిపోయింది.

Read Also: IND vs PAK: నేడు భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్.. వైదొలిగిన నలుగురు స్టార్స్! మ్యాచ్ కూడా డౌటే

ఇక, భక్తులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఆలయ అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేశారు. సుమారు 2500 మంది పోలీసులతో తెలంగాణ ప్రభుత్వం పటిష్ట భద్రత ఏర్పాట్లు చేసింది. బోనాలు జరుగుతున్న తీరును సమీక్షించేందుకు ఎక్కడికక్కడ సీసీ కెమెరాలను ఫిక్స్ చేశారు. అమ్మవారి బోనాల భద్రతా విధుల్లో సిటీ పోలీసులతో పాటు జిల్లాలకు చెందిన పోలీసులు కూడా ఉన్నారు. జేబు దొంగతనాలు, చైన్ స్నాచింగ్‌, అల్లర్లు జరగకుండా పోలీసులు నిఘా పెట్టారు. బోనాల్లో పోకిరిల ఆట కట్టించేందుకు మఫ్టీల్లో షీ టీమ్స్ కూడా తిరుగుతున్నారు. సున్నితమైన ప్రాంతాల్లో రాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను రంగంలోకి దించుతున్నారు. ఇప్పటికే బోనాల పండగ సందర్భంగా వైన్ షాప్‌లని ప్రభుత్వం మూసివేయగా.. బోనాలు జరుగుతున్న ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు.

Read Also: Son-Of-Sardar 2 : వాయిదా పడ్డ ‘సన్ ఆఫ్ సర్దార్ 2’.. కొత్త రిలీజ్ డేట్ ఇదే..!

కాగా, ఈ బోనాల పండుగలో పట్నం పోరగాళ్లు తీన్మార్ డ్యాన్స్ లతో ఎంజాయ్ చేస్తుంటారు. పోతరాజులతో కలిసి బోనాల ఊరేగింపులో యువత చేసే విన్యాసాలు బాగా ఆకర్షిస్తాయి. ఈ సందర్భంగా ఆలయ సమీపంలో డీజేలు పాటలకు యువకులు, యువతులు గుంపులుగా కలిసి చేసే మాస్ డ్యాన్స్ కూడా బోనాల పండుగలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. తెలంగాణలో బోనాల పండగ అంటేనే అందరు కలిసి మెలిసి చేసుకునే ఓ గొప్ప వేడుకలు అని చెప్పాలి.

https://www.youtube.com/watch?v=TSvr5RPc9sM

Exit mobile version