Lal Darwaza Bonalu: నేడే లాల్ దర్వాజా బోనాలు.. ధూం ధాం కి సిద్ధమైన పట్నం పోరగాళ్లు
- నేడు హైదరాబాద్ వ్యాప్తంగా బోనాల వేడుకలు..
- లాల్ దర్వాజా మహంకాళి ఆలయంలో భారీ ఏర్పాట్లు..
- అమ్మవారికి బంగారు బోనం సమర్పించనున్న మంత్రులు..
- 2500 మందితో భారీ బందోబస్తు ఏర్పాటు..
- బోనాలు జరుగుతున్న ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lal Darwaza Bonalu: తెలంగాణలోని అత్యంత ప్రాచీనమైన సాంస్కృతిక ఉత్సవాలలో బోనాల పండుగ ఒకటి. ఈ పండుగ దాదాపు 600 ఏళ్లకు పైగా చరిత్రను కలిగి ఉంది. హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో ప్లేగు వ్యాధి వ్యాప్తి చెందడంతో.. అనేక మంది ప్రజలు ఈ వ్యాధి బారిన పడి చనిపోయారు. ఈ సమయంలో, మిలిటరీ బెటాలియన్ జవానులు ఉజ్జయినిలోని మహంకాలి అమ్మవారిని ప్రార్థించి, ప్లేగు వ్యాధి తగ్గితే హైదరాబాద్‌లో ఆమెకు గుడి కట్టిస్తామని మొక్కుకోవడంతో.. ఆ తర్వాత ఈ వ్యాధి తగ్గింది.. ఇక, అప్పటి నుంచి సికింద్రాబాద్‌లో కాళీమాత అమ్మవారిని ప్రతిష్ఠించి బోనాలు వేడుకలు నిర్వహించడం అనావాయితీగా వస్తుంది. అలాగే, 1908లో ముసి నది వరద కూడా బోనాల పండుగ యొక్క ప్రాముఖ్యతను పెంచింది. వరదలో అనేక మంది ప్రాణాలు కోల్పోగా.. అప్పటి నిజాం, మీర్ మహబూబ్ అలీఖాన్, లాల్ దర్వాజా అమ్మవారి ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేసి, మూసి నదిలో పసుపు, కుంకుమ, గాజులు, పట్టు వస్త్రాలను సమర్పించినప్పటి నుంచి లాల్ దర్వాజాలోని సింహవాహిని ఆలయంలో ఆషాడ మాసపు చివరి ఆదివారం బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
Read Also: Hansika : విడాకుల పుకార్లపై స్పందించిన హీరోయిన్ హన్సిక భర్త సోహైల్..
Also Read
- Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
- Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
- విద్యార్థులకు గుడ్‌న్యూస్.. విడుదలైన TG PGECET 2026 ఫలితాలు.!
- Bolla Brahmanayudu : గండిపేట భూముల స్కామ్‌లో బిగ్ ట్విస్ట్.. ప్రధాన నిందితుడు బ్రహ్మనాయుడు అరెస్ట్!
అయితే, లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఇవాళ (జూలై 20న) ఉదయం ఘనంగా ప్రారంభమైంది. అమ్మవారికి బోనాలని సమర్పించడానికి భారీగా భక్తులు భారీగా వస్తున్నారు. అమ్మవారిని దర్శించుకోవడానికి ఆలయానికి భక్తులు క్యూ కట్టడంతో పరిసర ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. బోనాలతో వచ్చే భక్తులకు ఆలయ అధికారులు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయగా.. అమ్మవారి పాటలతో ఆలయ పరిసరాలు మొత్తం సందడిగా మారిపోయింది.
Read Also: IND vs PAK: నేడు భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్.. వైదొలిగిన నలుగురు స్టార్స్! మ్యాచ్ కూడా డౌటే
ఇక, భక్తులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఆలయ అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేశారు. సుమారు 2500 మంది పోలీసులతో తెలంగాణ ప్రభుత్వం పటిష్ట భద్రత ఏర్పాట్లు చేసింది. బోనాలు జరుగుతున్న తీరును సమీక్షించేందుకు ఎక్కడికక్కడ సీసీ కెమెరాలను ఫిక్స్ చేశారు. అమ్మవారి బోనాల భద్రతా విధుల్లో సిటీ పోలీసులతో పాటు జిల్లాలకు చెందిన పోలీసులు కూడా ఉన్నారు. జేబు దొంగతనాలు, చైన్ స్నాచింగ్, అల్లర్లు జరగకుండా పోలీసులు నిఘా పెట్టారు. బోనాల్లో పోకిరిల ఆట కట్టించేందుకు మఫ్టీల్లో షీ టీమ్స్ కూడా తిరుగుతున్నారు. సున్నితమైన ప్రాంతాల్లో రాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను రంగంలోకి దించుతున్నారు. ఇప్పటికే బోనాల పండగ సందర్భంగా వైన్ షాప్‌లని ప్రభుత్వం మూసివేయగా.. బోనాలు జరుగుతున్న ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు.
Read Also: Son-Of-Sardar 2 : వాయిదా పడ్డ ‘సన్ ఆఫ్ సర్దార్ 2’.. కొత్త రిలీజ్ డేట్ ఇదే..!
కాగా, ఈ బోనాల పండుగలో పట్నం పోరగాళ్లు తీన్మార్ డ్యాన్స్ లతో ఎంజాయ్ చేస్తుంటారు. పోతరాజులతో కలిసి బోనాల ఊరేగింపులో యువత చేసే విన్యాసాలు బాగా ఆకర్షిస్తాయి. ఈ సందర్భంగా ఆలయ సమీపంలో డీజేలు పాటలకు యువకులు, యువతులు గుంపులుగా కలిసి చేసే మాస్ డ్యాన్స్ కూడా బోనాల పండుగలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. తెలంగాణలో బోనాల పండగ అంటేనే అందరు కలిసి మెలిసి చేసుకునే ఓ గొప్ప వేడుకలు అని చెప్పాలి.
https://www.youtube.com/watch?v=TSvr5RPc9sM
తాజావార్తలు
-
Varanasi: రాముడు vs కుంభకర్ణుడు.. ఆ 30 నిమిషాల సీక్వెన్స్ ఆడియన్స్‌కు మైండ్ బ్లాకే.! జక్కన్న స్క్రిప్ట్ మాములుగా లేదుగా.!
-
TMC Rebellion: కోల్‌కతా టు ఢిల్లీ.. పార్లమెంట్‌కు పాకిన టీఎంసీ తిరుగుబాటు సెగ.. దీదీకి తప్పని అగ్నిపరీక్ష!
-
Today Gold and Silver Prices: పసిడి ధరలో భారీ పతనం.. వెండి కూడా చౌకైంది.. 22, 24 క్యారెట్ ధరలు ఎంతంటే?
-
Peddi vs Drishyam : మోహన్ లాల్‌కు “పెద్ది” దెబ్బ…. విదేశాల్లోనూ షాకే!
-
Delhi: అభిజీత్ దిప్కే పిలుపునకు భారీ స్పందన.. ‘కాక్రోచ్ మాస్కులు’ ధరించి నిరసన బాట పట్టిన యువత..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!