Site icon NTV Telugu

KTR: సజ్జనార్ జడ్జి కాదు, పోలీస్ అధికారి మాత్రమే..

Ktr

Ktr

KTR: ఫోన్ ట్యాపింగ్ ఎక్కడ జరిగిందో వాస్తవాలు చెప్పడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ధారావాహిక సీరియల్ మాదిరి ఫోన్ ట్యాపింగ్ కేసు నడిపిస్తున్నారు.. ఫోన్ ట్యాపింగ్ జరగలేదని నిన్నటి విచారణలో కేసీఆర్ చెప్పారు.. హరీష్ రావుకు సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది.. ఫోన్ ట్యాపింగ్ ఘట్టాన్ని ఇంతటితో ముగించాలని తెలిపారు. హైదరాబాద్ సీపీ సజ్జనార్ అయిన, ఇంకో అధికారి అయిన ఫోన్ ట్యాపింగ్ ఇల్లీగల్ అనుకుంటే కోర్టుకు వెళ్ళాలి కదా అని సూచించారు. సజ్జనార్ జడ్జీ కాదు , పోలీస్ అధికారి మాత్రమే అని ఆయన పేర్కొన్నారు. మరి ఈ మధ్య కాలంలో సజ్జనార్ జడ్జీ అయ్యాడేమో నాకు అయితే తెలియదని సెటైర్ వేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడికి పరిచయ కార్యక్రమం ఉంటే రాష్ట్రానికి రావొచ్చు అని కేటీఆర్ చెప్పుకొచ్చారు.

Read Also: CM Chandrababu: మంత్రులు, సీనియర్‌ నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. జాగ్రత్త.. వైసీపీ ట్రాప్‌లో పడొద్దు..!

అయితే, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఏ జిల్లా నాయకత్వం అక్కడ పని చేస్తుంది అని కేటీఆర్ అన్నారు. మేము ఎవరిని బ్లాక్ మెయిల్ చేశామో.. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పాలని డిమాండ్ చేశారు. బ్లాక్ మెయిల్ కు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి అని ఆరోపించారు. ఇక, కేసీఆర్ ను సిట్ అధికారులు విచారణకు పిలిస్తే, 7 వేల పైచిలుకు గ్రామాల్లో సీఎం దిష్టి బొమ్మలు తగులబెట్టారని తెలిపారు. ఆనాటి ఉద్యమ స్ఫూర్తి మాకు గుర్తొచ్చింది.. మమ్మల్ని తట్టి లేపిన.. రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు.. ప్రభుత్వానికి పరిపాలన చేయడం రావడం లేదు.. మేడారం జాతరను రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని జాతర నిర్వహిస్తారు.. ఈ ప్రభుత్వంలో ఈసారి మేడారం జాతర ఏర్పాటు చేయడంలో విఫల అయింది.. మంత్రి వాహనంపై దాడి చేశారని కేటీఆర్ విమర్శించారు.

Exit mobile version