Site icon NTV Telugu

Formula E Scam Case: ఫార్మలా-ఈ రేసు కేసులో కేటీఆర్కు ఏసీబీ నోటీసులు..

Acb

Acb

Formula E Scam Case: ఫార్ములా-ఈ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు రెండోసారి ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈనెల 28వ తేదీన విచారణకు రావాలని నోటీసుల్లో ఏసీబీ పేర్కొంది. మరోవైపు, ఫార్ములా-ఈ కేసులో మే 28న విచారణకు హాజరు కావాలని ఏసీబీ నాకు నోటీసు ఇచ్చింది అని కేటీఆర్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా.. ఈ కేసు పూర్తిగా రాజకీయ వేధింపు అయినప్పటికీ.. నేను ఖచ్చితంగా దర్యాప్తు సంస్థలకు సహకరిస్తాను అని తెలిపారు.

Read Also: PM Modi: మోడీ ర్యాలీకి హాజరైన కల్నల్ సోఫియా ఖురేషి ఫ్యామిలీ.. ప్రధాని ట్వీట్

అయితే, నేను చాలా ముందుగానే యూకే, అమెరికా పర్యటనకు వెళ్లడానికి ప్లాన్ చేసుకున్నాను అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. విదేశీ పర్యటనను ముగించుకుని వచ్చిన తర్వాత ఏసీబీ విచారణకు హాజరవుతాను అని పేర్కొన్నారు. ఏసీబీ అధికారులకు ఇదే విషయాన్ని లిఖితపూర్వకంగా తెలియజేశాను అన్నారు. కానీ, రాజకీయ ప్రతీకార దాహానికి.. ఎటువంటి చర్యలు తీసుకోవడానికి కూడా రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలను నేను అభినందిస్తున్నాను చెప్పుకొచ్చాడు. 48 గంటల క్రితం, నేషనల్ హెరాల్డ్ కేసులో డబ్బు సరఫరా చేసినందుకు ఈడీ ఛార్జిషీట్‌లో అతని పేరు ఉన్నట్లు తెలుస్తుంది.. ఆ తర్వాత రేవంత్ప్రధాని మోడీతో సహా బీజేపీ అగ్ర నాయకులను కలవడంతో ఒక్క భారతీయ జనతా పార్టీకి చెందిన అతడ్ని ఒక్క మాట కూడా అనలేదని కేటీఆర్ ఆరోపించారు.

Exit mobile version