NTV Telugu Site icon

KTR: సింగరేణిని ప్రైవేటీకరించేందుకే కేంద్రం తెలంగాణ బొగ్గు గనులను వేలం వేసింది..

Ktr

Ktr

KTR: సింగరేణి మాజీ ఎమ్మెల్యేలు, సింగరేణి ప్రాంత నాయకులు, పార్టీ సీనియర్ నాయకులు, బొగ్గు గని కార్మిక సంఘం నాయకులతో తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సింగరేణిని ప్రైవేటీకరించేందుకే కేంద్రం తెలంగాణ బొగ్గు గనులను వేలం వేసింది అని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కుమ్మక్కు అయి భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అని కేటీఆర్ ఆరోపణలు చేశారు.

Read Also: Blackmailing: సివిల్స్లో ఫెయిల్.. దొంగగా మారి ఏం పనులు చేస్తున్నాడో తెలుసా..?

ఇక, లాభసాటిగా ఉన్న సింగరేణికి బొగ్గు గనులు కేటాయించకుండా నష్టాల్లోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు అంటూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. ఆ తర్వాత సింగరేణి నష్టాల్లో ఉందంటూ పెట్టుబడుల ఉపసంహరణ కోసం సిద్ధం చేస్తున్నారు.. కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కు అయి.. నవ్వుకుంటూ సింగరేణి గనులను అమ్మకానికి పెట్టినట్లు ప్రతి సింగరేణి కార్మికుని అర్థమవుతోంది.. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సింగరేణిని కాపాడుకుంటామని ఆయన పిలుపునిచ్చారు. ఇక, బీఆర్ఎస్ అధికారంలో ఉన్న తొమ్మిదిన్నరేళ్ల పాటు సింగరేణి సంస్థ అభివృద్ధి, విస్తరణ కోసం కృషి చేశామన్నారు. కేసీఆర్ అధికారంలో ఉన్నన్ని రోజులు తెలంగాణ బొగ్గు గనులను వేలం వేయకుండా ఆపగలిగామని కేటీఆర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం బలవంతంగా రెండు బొగ్గు గనులను ప్రైవేట్ సంస్థలకు కేటాయించినప్పటికీ.. తట్టెడు తెలంగాణ బొగ్గును ఎత్తకుండా సక్సెస్ ఫుల్ గా అడ్డుకున్నామని గుర్తు చేశారు.