KTR: ఆ రైతులను విడిచి పెట్టమని రేవంత్‌కు చెప్పండి.. రాహుల్‌ని కోరిన కేటీఆర్..
- నిన్న మధ్యాహ్నం హీర్యా నాయక్ అనే రైతుకు సంగారెడ్డి జైలులో గుండె నొప్పి..
- కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం ఇవ్వలేదు..
- గుండె పోటు వచ్చిన వ్యక్తిని బేడీలు వేసి పోలీసు వాహనంలో తరలించారని ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: లగచర్ల ఘటన జరిగి ఈరోజుకు నెల రోజులు పూర్తి అయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇవాళ నంది నగర్ లోని తన నివాసం వద్ద కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీని ఒక విషయం కోరుతున్నానని కేటీఆర్ అన్నారు. లగచర్ల రైతులను విడిచి పెట్టమని సీఎం రేవంత్ రెడ్డికి చెప్పాలని కోరారు. బీఎన్ఎస్ఎస్ చట్టం ప్రకారం క్రూరమైన నేరస్తులకు మాత్రమే బేడీలు వేస్తారని గుర్తుచేశారు. కానీ రైతులకు బేడీలు వేసి హింసిస్తున్నారని కేటీఆర్ అన్నారు. రైతులను ఇలా ఇబ్బందులు పెడితే చరిత్ర హీనులుగా మిగిలి పోతారని తెలిపారు. నిన్న మధ్యాహ్నం హీర్యా నాయక్ అనే రైతుకు సంగారెడ్డి జైలులో గుండె నొప్పి వచ్చింది అని చెప్పారు.
Read also: KTR: నలభై మంది నెల రోజులుగా జైళ్లలో మగ్గుతున్నారు..
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
- Hyderabad: ఆ మార్గాల్లో వెళ్లేవారు రూట్ మార్చాల్సిందే.. ఈ ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్..
- Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన వర్షం.. ట్రాఫిక్ టోటల్ జామ్..!
ఆసుపత్రికి తీసుకెళ్లి కేవలం టెస్ట్ లు చేసి తీసుకు వచ్చారని గుర్తుచేశారు. ఈరోజు ఉదయం మరోసారి హీర్యా నాయక్ కు గుండె పోటు వచ్చిందని అన్నారు. అయినా సరే కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వలేదని కేటీఆర్ మండిపడ్డారు. గుండె పోటు వచ్చిన వ్యక్తిని బేడీలు వేసి పోలీసు వాహనంలో తరలించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంత ఘోరంగా నడుపుతున్నారని మండిపడ్డారు. తన మీద దాడి జరగలేదని కలెక్టర్ మాట్లాడారని అన్నారు. రేవంత్ రెడ్డి మాత్రం ప్రెస్టీజ్‌గా ఫీలై.. ఇంత రాద్ధాంతం చేస్తున్నాడని మండిపడ్డారు. రైతులను చిత్ర హింసలకు గురి చేశారని అన్నారు. నలభై మంది నెల రోజులుగా జైళ్లలో మగ్గుతున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. అదాని కోసం భూములు ఇవ్వమంటే రైతులు ఇవ్వమన్నారని తెలిపారు.
CM Chandrababu: సీఎం కీలక ఆదేశాలు.. వారి నుంచి పెన్షన్ మొత్తం రికవరీ..
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!