KTR: లగచర్ల ఘటన జరిగి ఈరోజుకు నెల రోజులు పూర్తి అయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇవాళ నంది నగర్ లోని తన నివాసం వద్ద కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. తన మీద దాడి జరగలేదని కలెక్టర్ మాట్లాడారని అన్నారు. రేవంత్ రెడ్డి మాత్రంప్రెస్టీజ్ గా ఫీల్ అయి.. ఇంత రాద్ధాంతం చేస్తున్నాడని మండిపడ్డారు. రైతులను చిత్ర హింసలకు గురి చేశారని అన్నారు. నలభై మంది నెల రోజులుగా జైళ్లలో మగ్గుతున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. అదాని కోసం భూములు ఇవ్వమంటే రైతులు ఇవ్వమన్నారని తెలిపారు.
నిన్న మధ్యాహ్నం హీర్యా నాయక్ అనే రైతుకు సంగారెడ్డి జైలులో గుండె నొప్పి వచ్చింది అని చెప్పారు. ఆసుపత్రికి తీసుకెళ్లి కేవలం టెస్ట్ లు చేసి తీసుకు వచ్చారని గుర్తుచేశారు. ఈరోజు ఉదయం మరోసారి హీర్యా నాయక్ కు గుండె పోటు వచ్చిందని అన్నారు. అయినా సరే కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వలేదని కేటీఆర్ మండిపడ్డారు. గుండె పోటు వచ్చిన వ్యక్తిని బేడీలు వేసి పోలీసు వాహనంలో తరలించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంత ఘోరంగా నడుపుతున్నారని మండిపడ్డారు. రాహుల్ గాంధీని నేను ఒక విషయం కోరుతున్నానని అన్నారు. ఆ రైతులను విడిచి పెట్టమని రేవంత్ రెడ్డికి చెప్పాలని కోరారు. బీఎన్ఎస్ఎస్ చట్టం ప్రకారం క్రూరమైన నేరస్తులకు మాత్రమే బేడీలు వేస్తారని గుర్తుచేశారు. కానీ రైతులకు బేడీలు వేసి హింసిస్తున్నారని కేటీఆర్ అన్నారు. రైతులను ఇలా ఇబ్బందులు పెడితే చరిత్ర హీనులుగా మిగిలి పోతారని కేటీఆర్ అన్నారు.
CM Chandrababu: సీఎం కీలక ఆదేశాలు.. వారి నుంచి పెన్షన్ మొత్తం రికవరీ..