NTV Telugu Site icon

KTR: రైతు భరోసా పై నిరసన.. బీఆర్‌ఎస్‌ శ్రేణులకు కేటీఆర్‌ పిలుపు

Ktr

Ktr

KTR: రైతు భరోసా పై బీఆర్ఎస్ నేడు నిరసనకు పిలుపు నిచ్చింది. మండల కేంద్రాలలో నిరసన కార్యక్రమాలు చేయాలని పార్టీ శ్రేణులకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు ఇచ్చారు. ప్రభుత్వం ఈ ఖరీఫ్ సీజన్ కు రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేస్తుప్పారు. వానాకాలం సీజన్‌లో రైతుల భరోసాను తుంగలో తొక్కిన కాంగ్రెస్‌ ప్రభుత్వ చర్యకు నిరసనగా పార్టీ శ్రేణులు నిరసన తెలపాలని కేటీఆర్‌ పిలుపునిచ్చారు. రైతుబంధును పూర్తిగా తొలగించే కుట్రలో భాగంగానే మంత్రివర్గ ఉపసంఘం, కొత్త మార్గదర్శకాలు రైతు భరోసా పేరుతో డ్రామాలు సృష్టిస్తున్నాయని ఆరోపించారు. రైతులకు అన్యాయం చేస్తే బీఆర్‌ఎస్‌ ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం కుట్రలు రైతులకు తెలిసేలా నిరసన తెలపాలని బీఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాంగ్రేస్ అధికారంలోకి వస్తే రైతుబంధుకి రామరామం చెబుతానని ఎన్నికల ముందు కేసీఆర్ చెప్పిన మాటలు నిజమయ్యాయని అన్నారు. వానాకాలం రైతు భరోసాను దూరం చేసి, రైతుల నోళ్లలో బురద జల్లారని మండిపడ్డారు. ఎట్టిపరిస్థితుల్లోనూ రైతాంగానికి వానాకాలం భరోసా ఇవ్వాలని, లేనిపక్షంలో కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ ముట్టడిస్తామని హెచ్చరించారు.
Telangana Govt: నేడు గ్రూప్‌-1 డిమాండ్లపై ప్రభుత్వం సమగ్ర ప్రకటన.. అభ్యర్థుల్లో టెన్షన్..