NTV Telugu Site icon

KTR Emotional Tweet: నేడు రాఖీ పౌర్ణమి.. కేటీఆర్ ఎమోషనల్ ట్వీట్

Ktr

Ktr

KTR Emotional Tweet: రాఖీ పండుగ సందర్భంగా దేశ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. సామాన్యులతో పాటు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు కూడా రాఖీ పండుగను జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో జైల్లో ఉన్న తన సోదరి కల్వకుంట్ల కవితను ఉద్దేశించి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఈరోజు తన సోదరి కవిత తనకు రాఖీ కట్టలేకపోవచ్చునని, అయితే ఆమె ఏ కష్టాలు వచ్చినా తనకు అండగా ఉంటానని కేటీఆర్ అన్నారు.

Read also: Kolkata Rape Case: సుప్రీం కోర్టులో కలకత్తా డాక్టర్ హత్యాచార ఘటన పై విచారణ..

ఎక్స్ లో కేటీఆర్ ఏమన్నారంటే.. ఈరోజు రాఖీ కట్టలేకపోవచ్చు. కానీ నువ్వు కష్టపడినా నేను నీకు అండగా ఉంటాను’ అంటూ పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్‌కి లవ్ సింబల్ ను జోడించారు. అంతకుముందు, సోదరి కవిత కేటీఆర్ కు కట్టిన రాఖీ చిత్రాన్ని పంచుకున్నారు.అయితే ఈసారి ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆమె తీహార్ జైలులో ఉన్నారు. ఐదు నెలలకు పైగా ఆమె జైల్లోనే ఉన్నారు. బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టులో పలుమార్లు విచారణ జరిగినా బెయిల్ మంజూరు కాలేదు. ఈ క్రమంలో వారానికి ఒకటి రెండు సార్లు కేటీఆర్ జైలుకు వెళ్లి కవితతో ములాఖత్ అవుతున్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా తన ఎక్స్ ఖాతాలో సోదరి కవితను గుర్తు చేసుకుంటూ కేటీఆర్ చేసిన ఆసక్తికర ట్వీట్ వైరల్‌గా మారింది.

Read also: VC.Sajjanar: మహిళా కండక్టర్‌ కు ఎండీ సజ్జనార్‌ అభినందనలు.. కారణం ఇదీ..

తెలంగాణ భవన్‌లో రాఖీ పండుగను ఘనంగా నిర్వహించారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు మహిళా నేతలు రాఖీ కట్టారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, మాజీ విప్ గొంగిడి సునీత, ఇతర నేతలు కేటీఆర్‌కు రాఖీ కట్టారు. మాజీ మంత్రి సత్యవతి ఆశీస్సులతో కేటీఆర్‌ను ఆశీర్వదించారు.

Read also: Raksha Bandhan-2024: సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన సీతక్క..

మరోవైపు బీఆర్‌ఎస్‌ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు నివాసంలో ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు జరిగాయి. పార్టీ మహిళా నేతలు హరీశ్‌రావుకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. రాఖీలు కట్టిన సోదరీమణులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ అన్నా చెల్లెళ్ల బంధానికి రాఖీ పండుగ ప్రతీక అని అన్నారు. అందరూ ప్రేమ, ఆప్యాయతలతో పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు. మహిళల సంక్షేమం, భద్రత కోసం కృషి చేస్తానన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
BREAKING: ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావుకు మధ్యంతర బెయిల్ మంజూరు