KTR Emotional Tweet: నేడు రాఖీ పౌర్ణమి.. కేటీఆర్ ఎమోషనల్ ట్వీట్
- రాఖీ పౌర్ణమి రోజు కేటీఆర్ ఎమోషనల్ ట్వీట్..
- ఈసారి నువ్వు రాఖీ కట్టలేక పోవచ్చు కానీ ఆప్యాయతలు మాత్రం తగ్గవు అంటూ ట్వీట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR Emotional Tweet: రాఖీ పండుగ సందర్భంగా దేశ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. సామాన్యులతో పాటు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు కూడా రాఖీ పండుగను జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో జైల్లో ఉన్న తన సోదరి కల్వకుంట్ల కవితను ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఈరోజు తన సోదరి కవిత తనకు రాఖీ కట్టలేకపోవచ్చునని, అయితే ఆమె ఏ కష్టాలు వచ్చినా తనకు అండగా ఉంటానని కేటీఆర్ అన్నారు.
Read also: Kolkata Rape Case: సుప్రీం కోర్టులో కలకత్తా డాక్టర్ హత్యాచార ఘటన పై విచారణ..
Also Read
ఎక్స్ లో కేటీఆర్ ఏమన్నారంటే.. ఈరోజు రాఖీ కట్టలేకపోవచ్చు. కానీ నువ్వు కష్టపడినా నేను నీకు అండగా ఉంటాను’ అంటూ పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్‌కి లవ్ సింబల్ ను జోడించారు. అంతకుముందు, సోదరి కవిత కేటీఆర్ కు కట్టిన రాఖీ చిత్రాన్ని పంచుకున్నారు.అయితే ఈసారి ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆమె తీహార్ జైలులో ఉన్నారు. ఐదు నెలలకు పైగా ఆమె జైల్లోనే ఉన్నారు. బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టులో పలుమార్లు విచారణ జరిగినా బెయిల్ మంజూరు కాలేదు. ఈ క్రమంలో వారానికి ఒకటి రెండు సార్లు కేటీఆర్ జైలుకు వెళ్లి కవితతో ములాఖత్ అవుతున్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా తన ఎక్స్ ఖాతాలో సోదరి కవితను గుర్తు చేసుకుంటూ కేటీఆర్ చేసిన ఆసక్తికర ట్వీట్ వైరల్‌గా మారింది.
Read also: VC.Sajjanar: మహిళా కండక్టర్ కు ఎండీ సజ్జనార్ అభినందనలు.. కారణం ఇదీ..
తెలంగాణ భవన్లో రాఖీ పండుగను ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మహిళా నేతలు రాఖీ కట్టారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, మాజీ విప్ గొంగిడి సునీత, ఇతర నేతలు కేటీఆర్‌కు రాఖీ కట్టారు. మాజీ మంత్రి సత్యవతి ఆశీస్సులతో కేటీఆర్‌ను ఆశీర్వదించారు.
Read also: Raksha Bandhan-2024: సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన సీతక్క..
మరోవైపు బీఆర్ఎస్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు నివాసంలో ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు జరిగాయి. పార్టీ మహిళా నేతలు హరీశ్‌రావుకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. రాఖీలు కట్టిన సోదరీమణులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ అన్నా చెల్లెళ్ల బంధానికి రాఖీ పండుగ ప్రతీక అని అన్నారు. అందరూ ప్రేమ, ఆప్యాయతలతో పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు. మహిళల సంక్షేమం, భద్రత కోసం కృషి చేస్తానన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
BREAKING: ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావుకు మధ్యంతర బెయిల్ మంజూరు
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్‌కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్‌కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్‌ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!