NTV Telugu Site icon

Phone Tapping: కేసులో కీలక పరిణామం.. నలుగురు మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు..

Phone Tapping

Phone Tapping

Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో విచారణ ముమ్మరం చేసిన పోలీసులు నిన్న(సోమవారం) నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ చిరుమర్తి లింగయ్యకు నోటీసులు అందజేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అదే పార్టీకి చెందిన మరో నలుగురు మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ అయ్యాయి. నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేల్లో ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు చెందిన నలుగురు మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. అమృత్-2 టెండర్లలో తెలంగాణ సర్కార్ అవినీతికి పాల్పడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన ఈ సమయంలో పోలీసులు ఇక్కడ నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఈ నోటీసులతో మిగిలిన బీఆర్‌ఎస్‌ కేడర్‌లో కూడా ఎవరికి నోటీసులు వస్తాయోనన్న ఆందోళన మొదలైంది. ఫోరెన్సిక్ నివేదికలో లభించిన ఆధారాల ద్వారా వారికి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. కాగా, ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావును రాష్ట్రానికి తీసుకొచ్చి విచారణ చేసేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఇప్పుడు అమెరికాలో గ్రీన్‌కార్డు పొందడంతో తెలంగాణకు తీసుకొచ్చి విచారణ చేసే అవకాశం లేదని న్యాయ నిపుణులు అంటున్నారు.
Vikarabad: ఆ మండలాల్లో ఇంటర్ నెట్‌ సేవలు బంద్‌.. పోలీసులు భారీ బందోబస్తు..

Show comments