NTV Telugu Site icon

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. ఆ ఇద్దరిపై రెడ్ కార్నర్ నోటీసులు

Phone Tapping Case

Phone Tapping Case

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, శ్రవణ్ కుమార్ లను భారత్ కు రప్పించేందుకు లైన్ క్లియర్ అయింది. ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయినట్లు ప్రకటన విడుదల చేసింది. రెడ్ కార్నర్ నోటీస్ పై ఇంటర్ పోల్ ద్వారా సీబీఐ నుంచి తెలంగాణ సీఐడీకి సమాచారం వచ్చింది. వీలైనంత త్వరగా భారత్ కు ఇద్దరిని రప్పించేందుకు కేంద్ర హోం శాఖతో పాటు విదేశీ వ్యవహారాల శాఖతో సంప్రదింపులు చేస్తున్నారు హైదరాబాద్ పోలీసులు. ఇక, ప్రభాకర్ రావు, శ్రవణ్ రావుల గురించి డీహెచ్ఎస్ కు సమాచారం అందగానే అమెరికాలో ప్రొవిజనల్ అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అమెరికా నుంచి నిందితులు డిపోర్టేషన్ ప్రక్రియ ద్వారా భారత్ కు పంపించే ఛాన్స్ ఉంది.

Read Also: Sunita Williams: చిరునవ్వుతో భూమిపై అడుగుపెట్టిన సునీత.. వీడియో వైరల్

అయితే, గతేడాది మార్చి 10వ తేదీన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన వెంటనే వీరిద్దరూ విదేశాలకు పారిపోయారు. ఈ కేసు విచారణ ముందుకు సాగాలన్నా.. ఈ కేసులో రాజకీయ నేతల ప్రమేయంపై ఆధారాలు బహిర్గతం కావాలన్నా వారిని విచారించాల్సిన అవసరం ఉందని పోలీసులు తెలిపారు. వారిని ఎప్పటిలోగా అరెస్ట్‌ చేస్తారంటూ ఇటీవల కోర్టు ప్రశ్నించడంతో అందుబాటులో ఉన్న అన్ని మార్గాలపై పోలీసులు ప్రత్యేకంగా నజర్ పెట్టారు.