Site icon NTV Telugu

Kavitha vs Harish Rao: మరోసారి హరీష్‌రావును టార్గెట్‌ చేసిన కవిత.. ట్రబుల్‌, బబుల్‌ షూటర్‌ ఏం చెబుతారని ఫైర్!

Kavitha Vs Harish

Kavitha Vs Harish

Kavitha vs Harish Rao: మరోసారి హరీష్‌రావును టార్గెట్‌ చేసింది ఎమ్మెల్సీ కవిత. తప్పులు చేసిన వారు అసెంబ్లీలో ఏం మాట్లాడతారంటూ సెటైర్లు వేసింది. ప్యాకేజీలు అమ్ముకున్న ట్రబుల్‌, బబుల్‌ షూటర్‌ ఏం చెబుతారు?.. మోసం చేసిన వ్యక్తికే బీఆర్ఎస్‌ డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌ పదవి ఇస్తే ఎలా? అని ప్రశ్నించింది. బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా జాగృతినే నిలుస్తుంది.. నీళ్ల గురించి కేసీఆర్‌ కంటే రేవంత్‌కి ఎక్కువ తెలుసా? హరీష్‌కు ఎక్కువ తెలుసా.? అని అడిగింది. అసెంబ్లీలో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ నడుస్తోంది.. అటు సీఎం, ఇటు బబుల్‌ షూటర్‌ ఉంటారు.. బబుల్‌ షూటర్‌ లేని బీఆర్ఎస్‌ పార్టీ బాగుపడుతుంది అని కవిత తెలిపింది.

Read Also: AKKI : హిట్టిచ్చిన హీరోయిన్స్ ను రిపీట్ చేస్తున్న అక్షయ్ కుమార్.. కలిసొచ్చేనా?

ఇక, 2006 నుంచి 2014 వరకు జాగృతి పేరుతో పని చేశాను అని కవిత వెల్లడించింది. మిగతా నాయకులు కేసీఆర్ చెప్పినట్లు పని చేశారు.. బండి నడిపేది ఒకరు, నేనే బండి నడుపుతున్నాను అని ఫీల్ అవుతున్నారు.. హరీష్ రావు నల్లికుంట్ల మనిషి.. ఏదైనా ఉంటే స్ట్రెయిట్ ఫార్వార్డ్ గా ఉండాలి.. నా వ్యాఖ్యలపై హరీశ్ పై పదే పదే వ్యాఖ్యలు చేసినా కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదో ఆయన్నే అడగాలే అని చెప్పుకొచ్చింది. ఇక, నేను రాజీనామా చేసి నాలుగు నెలలు అవుతుంది అని కవిత పేర్కొనింది. చివరిగా నాకు ఫ్లోర్ లో మాట్లాడే అవకాశం ఇవ్వాలని చైర్మన్ ను కోరా.. ఈ నెల 5వ తేదీ సభలో మాట్లాడే అవకాశం ఇస్తామని సమాచారం ఇచ్చారు.. కేసీఆర్ ను కసబ్ తో పోల్చడం చూస్తే నా రక్తం మరిగిపోతుందని చెప్పుకొచ్చింది. నేను కేసీఆర్ తో మాట్లాడక ఆరు నెలలు అవుతుందని మీడియా వేదికగా కవిత తెలిపింది.

Exit mobile version