NTV Telugu Site icon

Minister Damodar Raja Narasimha: జూడాలకు అండగా ఉంటాం.. అన్ని సమస్యలు పరిష్కరిస్తాం..!

Judas

Judas

Minister Damodar Raja Narasimha: హైదరాబాద్ లో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో జూడాలు భేటీ అయ్యారు. ఆ తర్వాత నిరసన చేస్తున్న జూడాలు సమ్మె విరమించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ జూడాలు గతంలో రెండు సార్లు మెడికల్ కాలేజ్, హాస్పిటల్స్ లో పెండింగ్ సమస్యలపై కలవడం జరిగింది అని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. 15వ తేదీన రిప్రజెంటేషన్ ఇచ్చారు.. ఉస్మానియా, గాంధీ ఆస్పత్రి లకు చరిత్ర ఉంది.. కానీ హాస్టల్స్ పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. కేఎంసీ రోడ్డు గురించి అడిగారు.. అలాగే, పోలీసు భద్రత కావాలని అడిగారు.. నేను, మా శాఖలోని ఉన్నతాధికారులతో మాట్లాడా.. వారి స్టై పెండ్ కోసం సుమారు 406 కోట్ల రూపాయల జీవో కూడా విడుదల చేసామన్నారు. హాస్టల్స్ నిర్మాణం, పునరుద్దరణకు దాదాపుగా రూ. 204 కోట్లు ఉస్మానియా, గాంధీ, కాకతీయ మెడికల్ కాలేజ్ కోసం విడుదల చేసామని మంత్రి దామోదర రాజనర్సింహా పేర్కొన్నారు.

Read Also: Minister Anam Ramanarayana Reddy: ప్రతిష్టాత్మకంగా రొట్టెల పండుగ.. ఏర్పాట్లపై మంత్రి ఆనం సమీక్ష..

ఇక, ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణం అనేది కోర్టు పరిధిలో ఉంది అని ఆరోగ్యశాఖ మంత్రి రాజనర్సింహా అన్నారు. కానీ మా ప్రభుత్వం ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణం పట్ల సీరియస్ గానే ఉంది.. పాలసీలలో మార్పులు తీసుకురాబోతున్నాం.. సమ్మె విరమించినందుకు జూడాలకు ధన్యవాదాలు అని మంత్రి చెప్పారు. ఇందులో రాజకీయాలు అవసరం లేదు.. సామాన్యుడికి మెరుగైన వైద్యం, నాణ్యమైన వైద్య విద్యను అందించే బాధ్యత ప్రభుత్వానిది.. అలాగే, మొబైల్ ఫుడ్ ల్యాబ్స్ పెంచబోతున్నాం.. డ్రగ్స్ కి సంబంధించిన ల్యాబ్స్ పెంచనున్నాం.. అన్ని రకాల ఫుడ్స్ అవైలబుల్ హైదరాబాద్ లో ఉంది కానీ నియంత్రణ లేదు… అది మేము చేస్తామన్నారు. క్లినికల్ ఎస్టబులిష్మెంట్ యాక్ట్ నీ కఠినంగా అమలు చేస్తామని మంత్రి దామోదర రాజనర్సింహా అన్నారు.