Site icon NTV Telugu

IT Raids: నగరంలో ఐటీ రైడ్స్.. 8 మంది అధికారులతో 3 టీమ్స్ తో సోదాలు

It Raids

It Raids

IT Raids: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఇవాళ ఉదయం నుంచి కూకట్‌పల్లి, బంజారాహిల్స్‌ చెక్‌పోస్టు, మాదాపూర్‌లోని ఇళ్లు, కార్యాలయాల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈ దాడుల్లో పది బృందాలు పాల్గొంటున్నాయి. కూకట్‌పల్లిలోని రెయిన్‌బో విస్టాస్‌ ఐ బ్లాక్‌లోని ఓ ఫ్లాట్‌లో అద్దెకు ఉంటున్న ఓ ఛానెల్ అధినేత బొల్లా రామకృష్ణ నివాసంలో కూడా అధికారులు తనిఖీలు చేస్తున్నారు. న్యూస్ ఛానెల్‌తో పాటు, అతను ఫైనాన్స్, హాస్పిటల్ మరియు రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని కూడా నిర్వహిస్తున్నాడు. అతని అపార్ట్‌మెంట్‌లో మొత్తం ఎనిమిది మంది అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆదాయ లావాదేవీలకు సంబంధించిన ఫైళ్లను పరిశీలిస్తున్నారు.
Emergency Landing: తిరుపతి వెళ్తున్న విమానంలో సాంకేతిక లోపం..

Exit mobile version