IT Rides: హైదరాబాద్‌లో మరోసారి ఐటీ దాడులు.. 30 చోట్ల తనిఖీలు ..
- హైదరాబాద్ లో ఐటీ దాడులు..
- 30 చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేస్తున్న ఐటీ అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IT Rides: హైదరాబాద్‌లో ఐటీ దాడులు మరోసారి కలకలం రేపుతున్నాయి. తాజాగా నగరంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఏకకాలంలో 30 చోట్ల ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. గురువారం తెల్లవారుజాము నుంచి ఐటీ సోదాలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి, జూబ్లీహిల్స్, రాయదుర్గం, చైతన్యపురి, మలక్‌పేట్, కొల్లూరు ప్రాంతాలలో ఏకకాలంలో సోదాలు కొనసాగిస్తున్నాయి. అన్విత బిల్డర్స్, ప్రాపర్టీస్ కార్యాలయాలు, మేనేజ్మెంట్ల ఇళ్లల్లో ఏకకాలంలో కొనసాగుతున్నాయి. చైతన్యపురి లోని గూగీ ప్రాపర్టీస్ కార్యాలయంలో సోదాలు చేపట్టారు.
మలక్ పేట నియోజకవర్గానికి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన షేక్ అక్బర్ ఇంటిలో సోదాలు చేస్తున్నారు. షేక్ అక్బర్ కు చెందిన గూగి ప్రాపర్టీస్ కార్యాలయాల్లో ఐటీ సోదాలు చేపట్టారు. అన్విత బిల్డర్స్ అధినేత బొప్పరాజు శ్రీనివాసు అచ్యుతరావు ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. విజయవాడకు చెందిన రియల్టర్ల పై ఐటీ సోదాలు చేస్తున్నారు. గుగి ప్రాపర్టీ చెందిన 15 చోట్ల ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. దీనికోసం మొత్తం 40 టీములు రంగంలోకి దిగింది. ఇవాళ ఉదయమే దాడుల కోసం 40 టీములుగా ఏర్పడి సోదాలు చేపట్టారు.
Also Read
- AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
- Alwal Case: అల్వాల్ మైనర్ బాలిక సామూహిక లైంగిక దాడి కేసులో షాకింగ్ ట్విస్ట్..
- CM Revanth Reddy : రేపు సీఎం రేవంత్ టూర్.. కరీంనగర్, సిరిసిల్లలో భారీ కార్యక్రమాలు
- ACB Raids : నిమ్స్ అధికారిపై ఏసీబీ సోదాలు.. బినామీల ఇళ్లలో కీలక పత్రాలు
Read also: Cyclone: బంగాళాఖాతంలో వాయుగుండం.. తెలంగాణలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం..
హైదరాబాద్‌లో ఐటీ అధికారులు సెప్టెంబరు లో 23న విస్తృతంగా సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. కూకట్పల్లి సమీపంలోని మూసాపేట్ రెయిన్బో విస్టాస్ అపార్ట్మెంట్లో తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో మొత్తం ఎనిమిది మంది అధికారులు పాల్గొన్నారు. అపార్ట్ మెంట్ లోని ‘ఐ బ్లాక్ ’లో అద్దెకు ఉంటున్న ఓ న్యూస్ ఛానెల్ యజమాని ఇంట్లో సోదాలు జరిగాయి. కాగా.. న్యూస్ ఛానెల్‌తో పాటు ఫైనాన్స్, హాస్పిటల్ ఐటీ సోదాలు నిర్వహించారు.
Astrology: అక్టోబర్ 17, గురువారం దినఫలాలు
తాజావార్తలు
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
-
Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి ‘రామోజీ గ్రూప్’.. ‘తెల్ల కాగితం’తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!