NTV Telugu Site icon

TG Inter Exams: ఎల్లుండి నుంచి ఇంటర్ పరీక్షలు.. విద్యార్థులకు కీలక సూచనలు

Inter Exams

Inter Exams

తెలంగాణలో బోర్డు ఎగ్జామ్స్ ప్రారంభం కాబోతున్నాయి. ఇందుకోసం విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇదిలా ఉంటే విద్యార్థుల కూడా పుస్తకాలు ముందు వేసుకుని చదువుతున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షల ఫీవర్ మొదలు కాబోతుంది.

ఇక బుధవారం నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 9 లక్షల 96,971 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇంటర్ ఫస్టియర్‌తో పరీక్షలు మొదలు కానున్నాయి. ఇందులో మొదటి సంవత్సరం విద్యార్థులు 4,88,448 మంది కాగా.. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 5, 08,523 మంది విద్యార్థులు ఉన్నారు. మొత్తం 1532 పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. 29,992 మంది ఇన్విజిలేటర్స్‌ను ఏర్పాటు చేశారు.

జిరాక్స్ సెంటర్లు మూసివేత..
గతంలో పేపర్ లీకేజీ వార్తల నేపథ్యంలో విద్యాశాఖ అప్రమత్తం అయింది. ఎలాంటి అవకతవకలు జరగకుండా అధికారులు అలర్ట్ అయ్యారు. ఇందులో భాగంగా పరీక్ష సమయంలో ఎగ్జామ్ సెంటర్ల సమీపంలో ఉన్న జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని అధికారులు ఆదేశించారు. ఇక ప్రతి ఎగ్జామ్ సెంటర్‌లో సీసీ కెమెరాల ఏర్పాటు చేయనున్నారు. ఈ కెమెరాలన్నీ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కి అనుసంధానం చేయనున్నారు. ఏ కారణం చేతనైనా విద్యార్థులకు హాల్ టికెట్స్ ఇవ్వకపోతే సంబంధిత కాలేజీల పైన చర్యలు ఉంటాయని అధికారులు వార్నింగ్ ఇచ్చారు. ఇక పరీక్ష సమయానికి అరగంట(ఉదయం 8.30 కి) ముందే అభ్యర్థులు పరీక్ష హాల్‌లో ఉండాలని అధికారులు సూచించారు.