Rain Alert: తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు వీడటం లేదు. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అంతేకాదు ఈరోజు తెల్లవారుజాము నుంచి పలుచోట్ల చిరు జల్లులు కురిశాయి. రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, మహబూబాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, సిరిసిల్ల, కరీంనగర్, వరంగల్, హనుమకొండ, జంగం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు అధికారులు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. అలాగే వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Read also: రాఖీని ఎన్ని రోజులు ఉంచుకోవాలి.. నియమాలు ఏమిటి?
అయితే ఈ భారీ వర్షాల సమయంలో గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని, కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదివారం సాయంత్రం కూడా నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా కోఠి, నాంపల్లి, సోమాజిగూడ, ఉప్పల్, తార్నాక, హయత్ నగర్, ఎల్బీనగర్, దిల్ సుఖ్ నగర్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో పలుచోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. రోడ్డుపై నీరు నిలవడంతో చాదర్‌ఘాట్ నుంచి ఎల్‌బీనగర్ వైపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు చోట్ల రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
Abhishek Singhvi: నేడు రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ సింఘ్వి నామినేషన్..
