అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముల బంధానికి గుర్తుగా రాఖీ పండుగను జరుపుకుంటారు. సోదరుడు తన సోదరికి జీవితాంతం తోడుగా ఉంటానని భరోసా ఇవ్వడం ఈ పండుగ ముఖ్య ఉద్దేశం.

ఈ పండుగకు పురాణాలు, చరిత్రలో కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ పండుగను రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశమంతటా జరుపుకుంటారు.

రాఖీ పండుగ, రక్షా బంధన్, రాఖీ పౌర్ణమి ఇలా ఏ పేరుతో పిలిచినా పండుగ ప్రయోజనం ఒక్కటే.

ఈ సంవత్సరం 2024 లో, రాఖీ పండుగ ఆగస్టు 19, సోమవారం వచ్చింది.

చాలా మంది అబ్బాయిలు రాఖీ కట్టిన తర్వాత రెండు, మూడు రోజులు అలాగే ఉంచి, రాఖీని తీసి ఎక్కడంటే అక్కడ వేస్తారు. అయితే అలా చేయకూడదని పండితులు అంటున్నారు.

రాఖీ కట్టేందుకు శుభ ముహూర్తం పాటించినట్లుగా చెబుతారు. కాబట్టి దానిప్రకారం రాఖీ ఎక్కడపడితే అక్కడ పాడేయకూదడని పండితులు చెబుతున్నారు.

రాఖీ విప్పడం గురించి జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతోంది అంటే.. రాఖీ కట్టిన తర్వాత 1 లేదా 2 రోజుల తర్వాత తీయకూడదు. రాఖీని కనీసం 21 రోజుల పాటు చేతిలో పెట్టుకోవాలి.

21 రోజులు రాఖీని పెట్టుకోలేక పోతే.. కనీసం శ్రీకృష్ణ జన్మాష్టమి (ఆగస్టు 26) వరకు ఉంచుకోవాలపి పండితేలే చెబుతున్నారు.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, రాఖీని తీసివేసిన తర్వాత దానిని ఎర్రటి గుడ్డలో చుట్టి, మీ సోదరికి సంబంధించిన వస్తువులతో  పాటు ఏదైనా పవిత్ర స్థలంలో ఉంచండి.

పవిత్ర స్థలంలో  ఉంచి వచ్చే రాఖీ పండుగ వరకు భద్రపరచండి. ఆ తర్వాత రాఖీని ప్రవహించే నీటిలో వదలండి.