NTV Telugu Site icon

Jagga Reddy: నేను ఎమ్మెల్సీ అడగడం లేదు.. అడగొద్దు కూడా..

Jaggareddy

Jaggareddy

Jagga Reddy: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఈరోజు ఢిల్లీకి పయనం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేను ఎమ్మెల్సీ అడుగుతలేను.. నేను అడగొద్దు కూడా అన్నారు. నాకు పార్టీ ఆల్రెడీ టికెట్ ఇచ్చింది.. పోటీ చేసిన పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఓడిపోయానని పేర్కొన్నారు. నేను మూడు సార్లు ఎమ్మెల్యేగా పని చేశా.. ఎమ్మెల్సీ కావాలని పడి పడి మరి అడిగే గుణం నాది కాదు అని వెల్లడించారు. మీడియా మిత్రులు ఎవరు కూడా ఎమ్మెల్సీ విషయంలో ఊహాగానాల వార్తలు రాయొద్దని జగ్గారెడ్డి తెలియజేశారు.

Read Also: AP Assembly 2025: అనర్హులకు పెన్షన్ తీసేసినా తప్పులేదు: మంత్రి కొండపల్లి

ఇక, 2017లో రాహుల్ గాంధీ సభ ఏర్పాట్ల గురించి వారి దృష్టికి తీసుకెళ్లాడం కోసమే గత ఆరు నెలల నుంచి ఢిల్లీకి వెళ్లాలని అనుకుంటున్నాను.. రాహుల్ సభ ఆర్గనైజేషన్, ఎలాంటి పరిస్థితుల్లో సభ ఏర్పాట్లు చేశానో ఆ విషయాలన్నింటినీ ఆయనకే స్వయంగా చెప్పాలని ఇప్పుడు హస్తినకు పోతున్నాను.. ఢిల్లీకి వెళ్ళిన తర్వాత రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోరుతాను.. అపాయంట్మెంట్ దొరికితే అతడితో మాట్లాడుతాను అని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు.

Read Also: Mani Shankar Aiyar: రాజీవ్‌గాంధీపై మణిశంకర్ అయ్యర్ వ్యక్తిగత విమర్శలు.. బీజేపీ కోవర్టు అంటూ కాంగ్రెస్ ఫైర్

అయితే, మరోవైపు.. కాంగ్రెస్ ముఖ్యనేత విజయశాంతి సైతం ఢిల్లీ బాట పట్టారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ సీటు కోసం ఆమె తన ప్రయత్నం మొదలు పెట్టారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసిన ఆమె తనకు సీటు కేటాయించాలని కోరారు. పార్టీ కోసం తాను చేసిన త్యాగాలు సహా మరికొన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలని విజయశాంతి విజ్ఞప్తి చేసింది.