NTV Telugu Site icon

Minister Komatireddy: సీఎంకి మంత్రి కోమటిరెడ్డి లేఖ.. ఎన్ కన్వెన్షన్ పై హైడ్రా వేటు..!

Komati Reddy

Komati Reddy

Minister Komatireddy: టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున ఎన్ కన్వెన్షన్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ నెల 21 తేదీన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖ రాశారు. మంత్రి లేఖ పైన త్వరిత గతిన విచారణ జరిపిన హైడ్రా కమిషనర్.. తుమ్మిడి కుంట చెరువులో ఎఫ్టీఎల్ ప్రాంతంలో కన్వెన్షన్ నిర్మించినట్లు తెలిపిన మంత్రి.. శాటిలైట్ ఫోటోలతో సహా ఆధారాలను హైడ్రాకు అందిచ్చిన మంత్రి కోమటిరెడ్డి.. మంత్రి లేఖ పై విచారణ జరిపి రంగంలో దిగిన హైడ్రా.. ఎన్ కన్వెన్షన్ ను నేలమట్టం చేసింది.

Read Also: Rohith Sharma: రోహిత్ శర్మ కోసం రూ.50 కోట్లైన ఇవ్వడానికి రెడీగా ఉన్న ఆ ఫ్రాంఛైజీలు..?

కాగా, ఇవాళ తెల్లవారు జామున భారీ బందోబస్తు మధ్య ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను హైడ్రా పూర్తిగా నేలమట్టం చేసింది. కన్వెన్షన్ సెంటర్లోని రెండు హాళ్లు పూర్తిగా పడగొట్టింది. కొన్ని గంటల్లోనే కన్వెన్షన్ సెంటర్లోని హాళ్లను అధికారులు కూల్చి వేశారు. కన్వెన్షన్ సెంటర్ కార్యాలయం గోడకు నోటీసులను అంటించి కూల్చివేతలు చేపట్టిన అధికారులు.. ముందుగా నోటీసులు ఇస్తే కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకునే అవకాశం ఉందని భావించిన హైడ్రా టీం.. అందుకోసమే కూల్చివేతలకు సంబంధించి ముందస్తు నోటీసులను అధికారుు ఇవ్వ లేదు.. తుమ్మిడి కుంట చెరువుకు సంబంధించి 3 ఎకరాల 30 గుంటల భూమిని ఆక్రమించారని నాగార్జునపై ఆరోపణలు గతంలో కూడా వచ్చాయి.. 3 ఎకరాల 30 గుంటల భూమిలో నిర్మించిన హాల్స్ ను హైడ్రా నేలమట్టం చేసింది.