Site icon NTV Telugu

Online Harassment: ఆన్‌లైన్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగినికి వేధింపులు.. హైదరాబాద్ వ్యక్తి అరెస్ట్

Online Harassment

Online Harassment

ఎన్ని కఠిన చట్టాలొచ్చినా మృగాళ్ల మార్పు రావడం లేదు. నిత్యం ఎక్కడో చోట మహిళలు వేధింపులకు గురవుతూనే ఉన్నారు. మంచిర్యాలకు చెందిన యువతికి ఆన్‌లైన్‌లో వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు హైదరాబాద్‌కు చెందిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇది కూడా చదవండి: US-India: టారిఫ్ ఉద్రిక్తతల వేళ ట్రంప్ కీలక నిర్ణయం.. భారత్‌లో నూతన రాయబారి నియామకం

మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన యువతి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. ఇంట్లో నుంచే వర్క్ ఫ్రమ్ హోం చేస్తోంది. అయితే ఈ మధ్య మెయిల్ ద్వారా వేధింపులు ఎక్కువయ్యాయి. అశ్లీల వీడియోలు.. చిత్రాలతో వేధింపులు ఎక్కువయ్యాయి. నకిలీ ఐడీ ద్వారా అసభ్యకరమైన అశ్లీల సందేశాలు వస్తున్నాయి. దీంతో విసుగెత్తిన ఆమె పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. నిందితుడు హైదరాబాద్‌కు చెందిన నిఖిల్‌బాబుగా గుర్తించారు. గతంలో పని చేసిన కంపెనీలో సహోద్యోగిగా పోలీసులు గుర్తించారు. కంపెనీలో పని చేస్తున్నప్పుడు నిఖిల్ బాబు.. ప్రేమిస్తున్నట్టు వెంటపడ్డాయి. అయితే అతడి ప్రేమను యువతి తిరస్కరించింది. దీన్ని అతడు మనసులో పగ పెట్టుకున్నాడు. నకిలీ ఐడీ సృష్టించి వేధించడం మొదలు పెట్టాడు. మందమర్రి పోలీసులు నిఖిల్ బాబును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

ఇది కూడా చదవండి: Vishnu Priya : నడుము అందాలతో మంటలు రేపిన విష్ణుప్రియ

Exit mobile version