Charminar Clock: నగరానికి తలమానికంగా హైదరాబాద్ నిలుస్తోంది. ప్లేగు వ్యాధి నివారణకు గుర్తుగా చార్మినార్‌ను 1591లో కుతుబ్ షాహీ రాజవంశానికి చెందిన ఐదవ పాలకుడు మహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించారు. ఇప్పట్లో హైదరాబాద్ అంటే మనకే కాదు.. విదేశీయులు కూడా చార్మినార్ గుర్తొస్తుంది. అంతటి ఘటన చరిత్ర కలిగిన చార్మినార్ చారిత్రక కట్టడంగా గుర్తింపు పొందింది. చార్మినార్ అంటే కొందరికి షాపింగ్, అక్కడ దొరికే ముత్యాలు గుర్తుకు తెస్తుంది. రాత్రిపూట చార్మినార్ అందాలను చూసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతారు. వారాంతాల్లో చార్మినార్ అందాలను చూసేందుకు, షాపింగ్ చేసేందుకు చాలా మంది వస్తారు. రంజాన్ మాసంలో చార్మినార్ రద్దీ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇసుక వేస్తే రాలనంత జనం పోటెత్తుతారు. ఇక మన దేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా చార్మినార్ చారిత్రక కట్టడంగా గుర్తింపు పొందింది. వందల ఏళ్ల చరిత్ర ఉన్న చార్మినార్‌కే కాదు, దానిపై ఉన్న గడియారాలకు కూడా గొప్ప చరిత్ర ఉంది.
Read also: Manu Bhaker: పారిస్ ఒలింపిక్స్ 2024.. చరిత్రకు అడుగు దూరంలో మను బాకర్!
అయితే చార్మినార్‌ను 1591లో కుతుబ్ షాహీ రాజవంశానికి చెందిన ఐదవ పాలకుడు మహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించాగా.. దానికి 1889లో చార్మినార్‌కు నాలుగు వైపులా గడియారాలను ఏర్పాటు చేశారు. 135 ఏళ్ల చరిత్ర ఉన్న గడియారం డయల్ బోర్డు ధ్వంసం అయ్యింది. చార్మినార్ మరమ్మతు పనుల్లో ఇనుప పైప్ తగిలి గడియారం ధ్వంసమైనట్లు తెలుస్తోంది. అయితే గడియారం పాక్షికంగా ధ్వంసం కావడంతో ఇప్పటికీ పనిచేస్తుంది. మరి, 135 ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన గడియారాన్ని మరిచిపోయి కొత్తది ఏర్పాటు చేస్తారా.. లేక మరమ్మతులు చేస్తారో వేచి చూడాల్సిందే. కాగా.. చార్మినార్ పనులు పూర్తయిన మరుసటి సంవత్సరం 1592లో చార్మినార్‌కు నాలుగు వైపులా తోరణాలు నిర్మించారు. చార్మినార్ కమాన్, కాళీ కమాన్, మచిలీ కమాన్, షేర్ ఇ బతుల్ అనే పేర్లతో ఉన్న ఈ తోరణాలు 60 అడుగుల ఎత్తు, 30 అడుగుల వెడల్పుతో ఇడో-పర్షియన్ శైలిలో నిర్మించబడ్డాయి. ఇది పురావస్తు నిర్మాణ నిధిగా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాచే తయారు చేయబడిన అధికారిక భవనాల జాబితాలో చేరింది. చార్మినార్ ప్రాంతానికి ఈశాన్యంలో, లాడ్ బజార్, పశ్చిమాన గ్రానైట్‌తో నిర్మించిన మక్కా మసీదు కూడా నిర్మించారు.
Telangana Assembly 2024: కేసీఆర్ రికార్డ్ బ్రేక్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి..