Holi Official Holiday 2026: హోలీ సెలవుపై గందరగోళం.. క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం..
Holi Official Holiday 2026: కామ దహనం ఎప్పుడు?.. హోలీ పండుగ జరుపుకునేది ఎన్నడు..? అనే విషయంపై కొంత గందరగోళమే ఏర్పడింది.. ఇక, ప్రభుత్వం ఏ రోజు హోలీ సెలవు ఇస్తుంది? అనే అంశంపై కూడా కొంత క్లారిటీ లేకుండా పోయింది.. దీనికి ప్రధాన కారణం తెలంగాణ పాఠశాల విద్యాశాఖ అకాడమిక్ క్యాలెండర్‌లో ఓ తేదీని పేర్కొంటే.. ప్రభుత్వం మరో రోజు సెలవు ఇవ్వడం మరింత కన్‌ఫ్యూజన్‌కు దారి తీసింది.. అయితే, ఈ భిన్న సెలవులపై క్లారిటీ ఇచ్చేసింది తెలంగాణ ప్రభుత్వం..
Read Also: Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీని శివుడితో పోల్చిన రాహుల్.. బీజేపీ విష్ణువు..!
Also Read
ప్రభుత్వం ప్రకటించిన విధంగానే పాఠశాలలకు కూడా రేపే సెలవు ఉండనుంది.. పాఠశాల విద్యా శాఖ తన అకడమిక్ క్యాలెండర్ లో మార్చి 4వ తేదీన హోలీ పండుగ సెలవుగా ప్రకటించింది.. అయితే, ప్రభుత్వ నిర్ణయాన్ని పరిగణనలోకి తీసుకుంటూ.. మార్చి 4వ తేదీన కాకుండా మార్చి 3వ తేదీనే సెలవు అని స్పష్టం చేస్తూ తాజాగా సర్క్యులర్ జారీ చేసింది తెలంగాణ పాఠశాల విద్యా శాఖ..
కాగా, ప్రతీ పండుగపై భిన్న వాదనలు ఉన్నట్టుగానే ఈ సారి హోలీ పండుగపై కూడా భిన్నమైన ప్రచారాలు సాగుతున్నాయి.. సోమవారం అంటే మార్చి 2వ తేదీన ( ఈరోజు) రాత్రి కామ దహనం చేసుకోవాలని.. మంగళవారం (మార్చి 3వ తేదీ) రోజు చంద్రగ్రహణం ఉన్న నేపథ్యంలో హోలీ జరుపుకోకూడదని.. చంద్రగ్రహణం మరుసటి రోజు అంటే మార్చి 4వ తేదీన హోలీ జరుపుకోవాలని కొంతమంది పండితులు సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ చేయగా.. ఇప్పుడు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం రేపే హోలీ హాలీడే కావడంతో.. ఈ రోజు (మార్చి 2న) కామ దహనం.. అదే విధంగా రేపు (మార్చి 3న మంగళవారం) హోలీ పండుగ ఉన్నట్టు ప్రభుత్వ ప్రకటనతో క్లారిటీ ఇచ్చినట్టు అయ్యింది..

తాజావార్తలు
-
Jyoti Poorvaj : అందాలతో మంట రాజేస్తున్న జ్యోతి పూర్వాజ్
-
Kidney Stones Rising in Summer: వేసవిలో కిడ్నీల్లో పెరిగిపోతున్న రాళ్లు.. ఇలా చెక్ పెట్టండి..!
-
Ajit Doval: యూఏఈలో అజిత్ దోవల్ పర్యటన.. దౌత్య సంబంధాలపై చర్చ
-
Maro Charitra: ఆ ఒక సినిమా వల్ల.. 20 జంటలు ఆత్మహత్య?
-
OnePlus Nord CE 6 Lite 5G: 7,000mAh బ్యాటరీ + Dimensity 7400 Apex.. వన్‌ప్లస్ నార్డ్ సిఇ 6 లైట్ ఫీచర్లు వెల్లడి
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!