NTV Telugu Site icon

HMDA Website: హైడ్రా బారిన పడకూడదంటే.. HMDA కొత్త వెబ్‌సైట్‌లో ఇలా చెక్ చేస్కోండి

Hydra

Hydra

HMDA Website: హైదరాబాద్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా హైడ్రా హడల్‌ కనిపిస్తోంది. హైదరాబాద్‌లో చాలా వరకు చెరువులు, కాల్వలు, అప్రోచ్ కాల్వలను రియల్టర్లు లేఅవుట్‌లుగా మార్చి విక్రయిస్తున్నారు. ఇది పూర్తిగా చట్టవిరుద్ధం. వీటిలో పూర్తి ట్యాంక్ స్థాయి (FTL), బఫర్ జోన్ అంటే క్యాచ్‌మెంట్ ఏరియా ఉన్నాయి. అయితే నగరంలో జనాభా పెరగడంతో చెరువుల బఫర్‌ జోన్‌, ఫుల్‌ ట్యాంక్‌ లెవెల్‌లో కూడా అక్రమ లేఅవుట్‌లలో ప్లాట్లు, ఇళ్లు, విల్లాలు, అపార్ట్‌మెంట్లు నిర్మిస్తున్నారు. ఇది తెలియక చాలా మంది ఇళ్ల స్థలాలను కొనుగోలు చేసి, ఇంటిని నిర్మించుకున్న వారందరూ హైడ్రా బారిన పడ్డారు. లక్షలు, కోట్లలో పెట్టి కట్టుకున్న ఇళ్లు పోయి.. కన్నీటితో రోడ్డుపై నిరాశ్రేయులుగా నిలపడాల్సి వచ్చింది. దీంతో.. భవిష్యత్ కొనుగోలుదారులకు ఇది సమస్యగా మారుతుంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) దీనికి పరిష్కారం చూపింది.

Read also: CM Revanth Reddy: రేవంత్ రెడ్డి రాకతో కొడంగల్లో సందడి వాతావరణం.. ముఖ్యులతో మాటామంతీ..

మీరు కొనడానికి ప్లాట్ లేదా ఇల్లు, బఫర్ జోన్‌లో, FTLలో ఉందా? కాదా అనేది సులువుగా తెలుసుకునేందుకు హెచ్‌ఎండీఏ ఓ పరిష్కారాన్ని కనిపెట్టింది. హైదరాబాద్‌లోని కొందరు రియల్టర్లు ఈ చార్టర్‌ను అడ్డుపెట్టుకుని శాశ్వత నిర్మాణాలు చేపట్టి వినియోగదారులకు విక్రయిస్తున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా, HMDA ఇటీవల https://lakes.hmda.gov.in/ పేరుతో అధికారిక వెబ్‌సైట్‌ను విడుదల చేసింది. ఈ వెబ్‌సైట్‌లో మీరు మీ జిల్లా, మండలం, గ్రామం పేరు ఆధారంగా మీ స్థలం బఫర్ జోన్‌లో ఉందో లేదా FTLలో ఉందో లేదో తనిఖీ చేయవచ్చు. మీరు కొనుగోలు చేయబోయే ఇల్లు లేదా స్థలం సురక్షితంగా ఉందో లేదో తెలుసుకోవడానికి ఇది మీకు సహాయపడుతుంది.

Read also: Jagga Reddy: ఎంత తోపులం అయిన సరే ఓ రోజు కాటికి వెళ్ళక తప్పదు..

ఆన్‌లైన్ తనిఖీ ప్రక్రియ:

* ముందుగా HMDA అధికారిక వెబ్‌సైట్ https://lakes.hmda.gov.in/ని తెరవండి
* ఇందులో జిల్లా, మండలం, గ్రామం, సరస్సు లేదా కుంట లేదా చెరువు పేరు, ఐడీ నంబర్ అనే ఆప్షన్లు కనిపిస్తాయి.
* మీరు దిగువన మీ జిల్లాను ఎంచుకుంటే.. మండలం, గ్రామం, సరస్సు లేదా కుంట లేదా చెరువు పేరు, ఐడి నంబర్ కనిపిస్తుంది.
* వీటిలో మీకు కావలసిన సరస్సు లేదా చెరువు లేదా చెరువు పేరు, ID నంబర్‌ను నమోదు చేసి, సెర్చ్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
* వెంటనే కుడి వైపున మీకు అవసరమైన FTL మరియు బఫర్ జోన్ ఎంపికలు కనిపిస్తాయి.
* మీకు అవసరమైన సమాచారాన్ని పొందడానికి ఈ ఎంపికలపై క్లిక్ చేయండి.
TGPSC Group-1 2024: రేపటి నుంచి టీజీపీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్‌ హాల్‌టికెట్లు.. మరి పరీక్షలు?

Show comments