NTV Telugu Site icon

Hit And Run Case: హైదరాబాద్లో హిట్ అండ్ రన్ కేసు.. ఒకరు అరెస్ట్!

Hit And Run

Hit And Run

Hit And Run Case: హైదరాబాద్ లో హిట్ అండ్ రన్ కేసు వెలుగు చూసింది. జగద్గీరిగుట్ట, షాపూర్ లలో వరుస రోడ్డు ప్రమాదాలు చేసిన కారు.. జగద్గీరి గుట్ట ఔట్ పోస్ట్ ప్రయాణికులను గుద్ది ఆపకుండా కారు వెళ్లిపోయింది. ఇదే కారు షాపూర్ లో మరి కొంత మంది ప్రయాణికులను సైతం ఢీకొట్టింది. దీంతో ప్రయాణికులకు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే, స్థానికులు ఆ కార్ ఆపేందుకు ఛేజ్ చేసి రాళ్లతో కొట్టిన ఆపకుండా దూసుకెళ్లింది.

Read Also: Kunamneni Sambasiva Rao : జగదీష్ రెడ్డి సస్పెన్షన్‌పై కూనంనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు

ఇక, ఈ ప్రమాద ఘటనపై క్షణాల్లో జీడీమెట్ల ట్రాఫిక్ పోలీసులు స్పందించారు. ట్రాఫిక్ సిగ్నల్ నిలిపి వేసి కార్లను ఆపి వేసి ప్రమాదానికి కారణమైన కారును పట్టుకున్నారు. కారు నడిపే వ్యక్తి మద్యం సేవించి ఉండటంతో ప్రమాదానికి కారణమైన డ్రైవర్ ని స్థానికులు, ప్రయాణికులు చితకబాదారు. కాగా, సురారం పోలీసులు హిట్ అండ్ రన్ కేసులో కారు నడిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. మద్యం మత్తులో కారు నడపవద్దని డ్రైవర్లకు హెచ్చరించిన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తు్న్నారు.. ఇలాంటి పరిణామాలు మరోసారి చోటు చేసుకుంటే.. కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు.